Site icon NTV Telugu

Goa: ఫలితాలపై ఉత్కంఠ.. క్యాంపులకు అభ్యర్థులు..

గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.. హంగ్‌ అసెంబ్లీ ఏర్పడనుందనే ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలతో ఒక్కసారిగా గోవాలో పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోయింది.. రాజకీయ కార్యకలాపాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ముందు జాగ్రత్తగా, కాంగ్రెస్‌ తన అభ్యర్థులందరినీ క్యాంప్‌లకు తరలించారు.. ఇవాళ ఒక రిసార్ట్ నుంచి మరొక రిసార్ట్ కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను తలరించారు.. గోవా ఫలితాలు, ఆ తర్వాత పరిణామాల పర్యవేక్షణ కోసం ఇప్పటికే గోవా చేరుకున్నారు మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం, ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న డీకే శివ కుమార్.. ఇక, బీజేపీ నేతలకు కూడా రంగంలోకి దిగుతున్నారు.. ఇవాళ రాత్రికి గోవాకు వెళ్లనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవిస్ తో పాటు ఇతర నేతలు… ఇప్పటికే ఎంజీపీ, బలమైన ఇండిపెండెంట్ అభ్యర్థులతో టచ్ లోకి వెళ్లిపోయారు బీజేపీ నేతలు..

Read Also: Gun Firing: సిద్దిపేటలో కాల్పుల కలకలం

ఇక, బీజేపీకి చెందిన ప్రస్తుత సీఎం ప్రమోద్‌ సావంత్‌ మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14వ తేదీన పోలింగ్‌ పూర్తవ్వగా, ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై ఓ కన్నేసి ఉంచేందుకు సీనియర్‌ నేత, రాష్ట్ర కాంగ్రెస్‌ ఎన్నికల పరిశీలకుడు పి.చిదంబరం, రాష్ట్ర ఇన్‌చార్జి దినేశ్‌ గుండూరావు, డీకే శివకుమార్‌ ఆదివారం నుంచి గోవాలోనే ఉన్నారు. ఇప్పటికే క్యాంపుల్లో ఉన్న ఫలితాల అనంతరం గెలిచిన వారు పార్టీ కార్యాలయానికి తిరిగి రావాల్సి ఉంటుంది అని చెబుతున్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతుల.. మరోవైపు.. గోవాలో గెలిచే ప్రతి సీటూ కీలకమైంది కావడంతో టీఎంసీ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. బేరసారాలు, క్యాంపు రాజకీయాలకు ఎక్కువ అవకాశం ఉందని భావిస్తోంది. వాటికి ఆస్కారం లేకుండా ఎత్తుగడలు వేస్తోంది.. కాగా, 40 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ, కాంగ్రెస్‌ చెరో 16 సీట్లు గెలుచుకుంటాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన మెజారిటీ సంఖ్య మాత్రం 21. మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీతో జట్టుకట్టి రాష్ట్రంలో మొదటిసారిగా అభ్యర్థులను బరిలోకి దించిన టీఎంసీకి మూడు సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. దీంతో, గోమంతక్‌ పార్టీ, టీఎంసీలతోపాటు ఆప్‌తోనూ చర్చలకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్‌ చెబుతోంది.. మరి రేపు ఫలితాలు ఎలా ఉంటాయి? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఆసక్తికరంగ మారింది.

Exit mobile version