Site icon NTV Telugu

జాతిపిత‌కు అమెరికా అత్యున్నత పురస్కారం…!!

అమెరికా అత్యున్న‌త పుర‌స్కారం జాతిపిత మ‌హాత్మ‌గాంధీకి అంద‌జేయాల‌ని  ప్ర‌తినిధుల చ‌ట్ట‌స‌భ‌లో న్యూయార్క్ స‌భ్యురాలు క‌రోలిన్ బిమాలోని తీర్మానం చేశారు.  ఈ తీర్మానానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం పొందింది.  కాంగ్రెష‌న‌ల్ గోల్డ్ మెడ‌ల్ అవార్డును అమెరికా అత్యున్న‌త పుర‌స్కారంగా భావిస్తారు.  ఈ పుర‌స్కారం గ‌తంలో అమెరికా మాజీ అధ్య‌క్షుడు జార్జ్ వాషింగ్ట‌న్‌, జూనియ‌ర్ మార్టిన్ లూథ‌ర్ కింగ్‌, ద‌క్షిణాఫ్రికా మాజీ అధ్య‌క్షుడు నెల్స‌న్ మండేల, మ‌ద‌ర్ థెరీసా, రోసా పార్క్ వంటి గొప్ప వ్య‌క్తుల‌కు మాత్ర‌మే ద‌క్కింది.  కాగా, ఇప్పుడు ఈ పుర‌స్కారం భార‌త జాతిపిత‌కు ఇవ్వాలని అమెరికా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవ‌డం గొప్ప విష‌యంగా చెప్పాలి.

Read: ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌: ఆగ‌స్టు 14ను ఇలా జ‌రుపుకుందాం…

భార‌త స్వాతంత్రోద్య‌మం స‌మ‌యంలో మ‌హాత్మాగాంధీ చేస‌ట్టిన స‌త్యాగ్ర‌హం ఉద్య‌మం ప్ర‌పంచంలోని కొట్లాది మందికి ప్రేర‌ణ‌గా నిలిచింద‌ని, అందులో తాను ఒక‌రినని న్యూయార్క్ చ‌ట్ట‌స‌భ స‌భ్యురాలు క‌రోలిన్ బిమాలోని పేర్కొన్నారు.  జాతి స‌మాన‌త్వం కోసం జూనియ‌ర్ మార్టిన్ లూథ‌ర్ కింగ్ నుంచి వ‌ర్ణ‌వివ‌క్షకు వ్య‌తిరేకంగా పోరాటం చేసిన నెల్స‌న్ మండేలా పోరాట వ‌ర‌కు మ‌హాత్మాగాంధీ వారస‌త్వం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌నిపిస్తుంద‌ని ఆమె పేర్కొన్నారు.  ప్ర‌పంచంలో మార్పులు చూడాలంటే గాంధీ ఆదేశాల‌ను పాటించాల‌ని అన్నారు.

Exit mobile version