Site icon NTV Telugu

West Bengal: మళ్లీ బెంగాల్ డీజీపీగా రాజీవ్‌కుమార్‌

Rajeevkumar

Rajeevkumar

పశ్చిమ బెంగాల్‌లో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మరోసారి రాష్ట్ర డీజీపీగా రాజీవ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు మమత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో రాజీవ్‌కుమార్‌ను మమతాబెనర్జీ ప్రభుత్వం డీజీపీగా నియమించింది. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆ పోస్ట్ ‌నుంచి ఆయన్ని కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. ఆ స్థానంలో రాజీవ్‌కుమార్ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ సంజయ్ ముఖర్జీని బెంగాల్ డీజీపీగా నియమించింది.

ఇది కూడా చదవండి: Agriculture: కేంద్రం కీలక నిర్ణయం.. గ్రామీణ పరిశ్రమల కోసం వ్యవసాయ నిధి ఏర్పాటు!

అయితే ఇటీవల లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. అలాగే రాష్ట్రంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు సైతం మొన్నటితో ముగిశాయి. దీంతో ఎలక్షన్ కోడ్ ముగియడంతో తిరిగి రాజీవ్‌కుమార్‌ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు డీజీపీగా వ్యవహరించిన సంజయ్ ముఖర్జీ.. తిరిగి అగ్నిమాపక శాఖ డీజీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇది కూడా చదవండి: Congress : బీఆర్‌ఎస్‌కు డబుల్‌ షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన మహిపాల్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్‌

Exit mobile version