Site icon NTV Telugu

క్విట్ ఇండియా ఉద్యమానికి 79 ఏళ్లు…

1920 నుంచి భారత స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించిన వారిలో గాంధీ మహాత్ముడు ముందువ‌ర‌స‌లో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు.  అహింసా మార్గంలో ఆయన పోరాటం చేశారు.  సత్యాగ్రహ దీక్ష‌తో ఆక‌ట్టుకున్నారు.  దండి మార్చ్‌, విదేశీ దుస్తుల బ‌హిష్క‌ర‌ణ వంటి కీల‌క పోరాటాలు చేశారు.  రెండో ప్ర‌పంచ యుద్ధం ప్రారంభ‌మ‌య్యాక ఇండియాలో స్వాంతంత్ర పోరాటం మ‌రింత ఉధృతం అయింతి.  ఇండియాకు స్వాతంత్రం ఇవ్వాల్సిన ప‌రిస్థితులు ఉన్న‌ప్ప‌టికీ బ్రిటీష్ పాల‌కులు నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటుగా, రెండో ప్ర‌పంచ యుద్ధం పూర్త‌య్యాక చూద్దాంలే అని చెప్ప‌డంటో క్విట్ ఇండియా ఉద్యమం రూపుదాల్చింది.  

Read: వివాదంలో మణిరత్నం “నవరస”

1942, ఆగ‌స్టు 8 వ తేదీన బాంబేలో జ‌రిగిన అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ స‌మావేశంలో మ‌హాత్మాగాంధీ క్విట్ ఇండియా ఉద్య‌మానికి పిలుపునిచ్చారు.  క్రిప్స్ మిష‌న్ విఫ‌ల‌మైన త‌రువాత మ‌హాత్మ‌గాంధీ ఈ ఉద్య‌మానికి పిలుపునిచ్చారు.  ఈ ఉద్య‌మం స‌భ‌లో డూ ఆర్ డై కి పిలుపునిచ్చారు.  ఒక‌వైపు యుద్ధం, మ‌రోవైపు ఇండియాలో స్వాతంత్రం కోసం పోరాటం తీవ్రం కావ‌డంతో బ్రిటీష్ పాల‌కులు దేశంలోని వేలాది మంది నేత‌ల‌ను ఆరెస్టులు చేసి జైల్లో ఉంచారు.  యుద్ధం పూర్త‌య్యేవ‌ర‌కు వారిని జైలు నుంచి విడుద‌ల చేయ‌లేదు.  క్విట్ ఇండియా ఉద్య‌మం స‌మయంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్ర‌జ‌లు స్వ‌చ్చందంగా రోడ్ల‌మీద‌కు వ‌చ్చి నిర‌స‌న‌లు తెలిపారు.  ఆ స‌మ‌యంలో కొన్ని చోట్ల చిన్న త‌ర‌హా ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నాయి.  బ్రిటీష్ పాల‌కుల‌పై ఒత్తిడి తీసుకురావ‌డంలో క్విట్ ఇండియా ఉద్య‌మం కీల‌క పాత్ర పోషించింద‌ని చెప్పాలి.  కాగా, క్విట్ ఇండియా ఉద్య‌మానికి నేటిలో 79 ఏళ్లు పూర్త‌య్యాయి.  ఈ సంద‌ర్బంగా క్విట్ ఇండియా ఉద్య‌మం గురించిన ఎగ్జిబిష‌న్‌ను ఢిల్లీలో ఏర్పాటు చేశారు.  

Exit mobile version