NTV Telugu Site icon

Reliance Jio: రిలయన్స్ జియో దూకుడు.. క్యూ1లో 24 శాతం పెరిగిన లాభాలు

Reliance Jio

Reliance Jio

మరికొన్ని రోజుల్లో 5 జీ స్పెక్ట్రమ్ వేలం ప్రారంభం కాబోతోంది. ఇదే సమయంలో రిలయన్స్ జియో దుమ్మురేపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దూకుడు ప్రదర్శించింది. భారతదేశ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ శుక్రవారం తన ఎప్రిల్-జూన్ తొలి త్రైమాసిక లాభాలను ప్రకటించింది. తొలి త్రైమాసికానికి రూ. 21,873 కోట్ల ఆదాయాలను నమోదు చేసింది. నికర లాభం 24% పెరిగింది. ఇది గతేడాదితో పోలిస్తే 21.5 శాతం ఎక్కువ అని వెల్లడించింది. జూన్ 2022తో ముగిసే త్రైమాసికంలో రూ. 4,355 కోట్ల స్టాండ్ లోన్ నికర లాభం సాధించింది. గతేడాది రూ.3501కోట్లతో పోలిస్తే ఇది 23.8 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Read Also: Satellite Internet: దేశంలో మరో కొత్త టెక్నాలజీ.. శాటిలైట్ ఇంటర్నెట్‌తో కేబుళ్లు అవసరం లేదండోయ్..!!

భారత్ లో 5 జీ టెక్నాలజీ సేవలకు మరికొన్ని రోజుల్లో వేలం జరగనుంది. ఈ సమయంలో రిలయన్స్ జియో మంచి లాభాలను సాధించింది. ప్రస్తుతం ఉన్న 4జీ టెక్నాలజీ వేగం కన్నా దాదాపు 10 రెట్లు ఎక్కువగా 5 జీ ఉండనుంది. మొత్తం 72 గిగాహెర్జ్ స్పెక్ట్రాన్ని వేలం వేయనున్నారు. దీని విలువ మొత్తం 4.3 లక్షల కోట్లు. జూలై 26 నుంచి వేలం ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. రాబోయే వేలంలో పాల్గొనేందుకు ఈ వారం ప్రారంభంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఆర్జిస్ట్ మనీ డిపాజిట్(ఈఎండీ) కింద రూ. 14,000 కోట్లను డిపాజిట్ చేసింది. భారతీ ఎయిర్ టెల్ రూ. 5,500 కోట్లు, వోడాఫోన్ ఐడియా రూ. 2,200 కోట్లు డిపాజిట్ చేసింది. మరోవైపు అదానీ డేటా నెట్వర్క్ డిజిటిట్ కింద రూ. 100 కోట్లను డిపాజిట్ చేసింది. మొత్తం నలుగురు బిడ్డర్లలో రిలయన్స్ జియో ఎక్కువ అర్హత పాయింట్లను సాధించింది.