NTV Telugu Site icon

ఉద్యోగుల‌కు రిల‌య‌న్స్ భ‌రోసా… ఐదేళ్ల‌పాటు…

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఎంతో మంది మృత్యువాత ప‌డ్డారు.  మ‌ర‌ణించిన వ్యక్తుల‌కు సంబందించిన కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయి.  పిల్లలు అనాథ‌లుగా మారుతున్నారు.  దీంతో వారిని ఆదుకోవ‌డానికి ప్ర‌భుత్వాలు అనేక ర‌కాల ప‌థ‌కాలు రూపోందిస్తున్నాయి.  టాటా సంస్థ త‌మ సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగులు క‌రోనాతో మ‌ర‌ణిస్తే వారి కుటుంబానికి ఈ వ్య‌క్తి రిటైర్ అయ్యే వ‌ర‌కూ జీతం అందిస్తామ‌ని పేర్కొంది.  దీంతో పాటుగా కుటుంబ‌లోని పిల్ల‌ల చ‌దువుకు సంబందించిన బాధ్య‌త‌ను కూడా తీసుకుంటామ‌ని తెలిపింది.  ఈ బాట‌లో ఇప్పుడు రిల‌య‌న్స్ సంస్థ‌కుడా న‌డిచింది. రిల‌య‌న్స్ సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగులు క‌రోనా బారిన ప‌డి మ‌ర‌ణిస్తే వారి కుటుంబాల‌కు ఉద్యోగికి సంబందించిన జీతాన్ని ఐదేళ్ల‌పాటు అందిస్తామ‌ని, ఉద్యోగి పిల్ల‌ల చ‌దువు బాధ్య‌త‌ల‌ను తామే స్వీక‌రిస్తామ‌ని రిల‌య‌న్స్ సంస్థ పేర్కొన్న‌ది. ఉద్యోగుల‌కు రిల‌య‌న్స్ సంస్థ లేఖ రాసింది.  చ‌నిపోయిన వ్య‌క్తుల పిల్ల‌లు డిగ్రీ పూర్తి చేసే వ‌ర‌కు వారి కుటుంబానికి సంబందించి వైద్య ఖ‌ర్చుల‌కు సంబందించిన ప్రీమియంను తామే చెల్లిస్తామ‌ని, ఆసుప‌త్రుల ఖ‌ర్చుల‌న్నీ పూర్తిగా తాము భ‌రిస్తామ‌ని తెలిపారు.