NTV Telugu Site icon

Delhi CM Rekha Gupta: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం..

Guptha

Guptha

Delhi CM Rekha Gupta: ఢిల్లీ 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాంలీలా మైదానంలో ఘనంగా జరిగింది. మధ్యాహ్నం 12:35 గంటలకి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రేఖాతో పాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ ప్రమాణం చేయగా.. మజీందర్ సింగ్ సిర్సా, పంకజ్ కుమార్ సింగ్, రవీందర్ సింగ్ ఇంద్రజ్, ఆశీష్ సూద్, కపిల్ మిశ్రా మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు.

Read Also: Delhi CM Oath Ceremony LIVE Updates: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. లైవ్ అప్డేట్స్

అయితే, ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. అలాగే, 20 ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సైతం వచ్చారు. అలాగే, 50 మంది సినీ, వ్యాపార ప్రముఖులతో పాటు వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.