Delhi CM Rekha Gupta: ఢిల్లీ 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్త ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాంలీలా మైదానంలో ఘనంగా జరిగింది. మధ్యాహ్నం 12:35 గంటలకి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె సీఎం పదవిని చేపట్టారు. రామ్‌లీలా మైదానంలో ప్రజల సమక్షంలో రేఖా గుప్తా పట్టాభిషేక కార్యక్రమం జరిగింది.
ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఎన్డీయే నేతల సమక్షంలో రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీ మర్లేనా తర్వాత ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్న నాలుగో మహిళగా ఆమె నిలవనుంది.