తొలి కేబినెట్ సమావేశంలోనే మేనిఫెస్టో హామీలు నెరవేరుస్తామని చెప్పి చేయలేదన్న మాజీ సీఎం అతిషి ఆరోపణలను ముఖ్యమంత్రి రేఖా గుప్తా తిప్పికొట్టారు. కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆప్ 13 ఏళ్లు ఢిల్లీని పాలించాయని… ఇన్నేళ్లు మీరేం చేశారో చూసుకోవాలని హితవు పలికారు. అధికారంలోకి వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు.. అప్పుడే విమర్శలు చేస్తారా..? అంటూ మండిపడ్డారు. తొలి రోజే కేబినెట్ సమావేశం జరిపామని.. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు గుర్తుచేశారు. ఈ పథకంతో రూ.10 లక్షల మేర వైద్య సహాయం అందనుందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ఆప్ ప్రభుత్వం అమలు చేయలేదని.. ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించే హక్కు వారికి లేదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Honda Shine: ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ! మార్కెట్లోకి కొత్త హోండా షైన్
ఆప్ నుంచి చాలా మంది పార్టీని వీడాలని చూస్తున్నారని.. ముందు మీ పార్టీ గురించి చూసుకోవాలని అతిషికి సూచించారు. కాగ్ రిపోర్ట్‌ను అసెంబ్లీలో పెడితే అందరి జాతకాలు బయటపడతాయని ఆప్ ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోందని రేఖా గుప్తా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 నాటికి అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రతినెల రూ.2,500 జమ చేస్తామని తెలిపారు. ఢిల్లీ అభివృద్ధి కోసం ఒక్కరోజు కూడా సమయం వృథా చేయకుండా శ్రమిస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Koneru Konappa: కాంగ్రెస్కు భారీ షాక్.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై