ఏకంగా ఎయిర్‌పోర్ట్‌లోనూ భారీగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి.. చెన్నై పోర్టులో ఎర్ర చందనం దుంగలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. ఓ భారీ కంటైనర్ లో రూ.5 కోట్ల విలువ చేసే ఎర్ర చందనం గుర్తించారు కస్టమ్స్ అధికారులు… చెన్నై నుండి సముద్ర మార్గం ద్వారా తైవాన్ వెళుతున్న ఓ భారీ కంటైనర్ లో ఎర్ర చందనం ఎగుమతి అవుతుందన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు.. రాళ్ల ముసుగులో ఎర్ర చందనం ఎగుమతి చేస్తున్న కేటుగాళ్ల ఆట కట్టించారు.. ఎర్ర చందనంతో పాటు కంటైనర్ ను సీజ్ చేశారు.. ఇంత భారీగా ఎర్రచందనం తరలిస్తున్నారంటే.. ఈ గ్యాంగ్ వెనుక ఎవరు ఉన్నారు? అనేదానిపై తీగలాగుతున్నారు అధికారులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఎయిర్‌పోర్ట్‌లో రూ.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత..
Red sandalwood