NTV Telugu Site icon

February Temperature: 1877 తర్వాత ఈ ఫిబ్రవరిలోనే ఎండలు అధికం..

Summer

Summer

February Temperature: ఎండాకాలం ఇంకా పూర్తిగా రానేలేదు. అప్పుడు సూర్యుడు తన ప్రకోపాన్ని చూపిస్తున్నాడు. ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత నమోదు అయింది. ఉదయం పూట కాస్త చలిగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 1877 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో సగటు ఉష్ణోగ్రత 29.54 డిగ్రీలుగా ఉన్నట్లు తెలిపింది. ఇలా పెరుగుతున్న ఉష్ణగ్రతలకు గ్లోబల్ వార్మింగ్ కారణం అని వెల్లడించింది.

Read Also: ICC Rankings: టాప్ ర్యాంక్‌లోకి భారత బౌలర్ రవిచంద్రన్‌ అశ్విన్‌.. ఒక స్థానం ఎగబాకిన బుమ్రా

దక్షిణ భారతదేశంతో పాటు మహారాష్ట్రాలోని కొన్ని ప్రాంతాల్లో తప్పితే ఈ వేసవి కాలంలో అన్ని చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన చోట్ల సాధారణం, సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. మధ్య భారతదేశం, నైరుతి భూభాగంలో మార్చి నుంచి మే వరకు వడగాలుల వీచే అవకాశం ఉంది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా సగటున 15.49 డిగ్రీలు ఉంటే ఈ ఏడాది 16.82 డిగ్రీలుగా నమోదు అయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంత ఎక్కువ స్థాయిలో నమోదు కావడం ఇది ఐదోసారి.

ఈ ఫిబ్రవరిలో వాయువ్య భారత్ లో 24.86 డిగ్రీలు( సాధారణం కన్నా 3.4 డిగ్రీలు అధికం), సెంట్రల్ ఇండియాలో 31.93( 2.05 డిగ్రీలు అధికం), తూర్పు, ఈశాన్య ఇండియాలో 13.99 డిగ్రీలు ( 1.67 డిగ్రీలు అధికం) నమోదు అయ్యాయి. రాబోయే మార్చి నుంచి మే నెలల మధ్యకాలంలో దేశంలోని ఈశాన్యం, తూర్పు, మధ్య భారతాల్లో చాలా ప్రాంతాల్లో, నైరుతి భాగంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది.