Saif Ali Khan: ‘‘నిజంగా కత్తి దాడి జరిగిందా, నటిస్తున్నాడా..?’’ సైఫ్‌పై మినిస్టర్ అనుమానం..
- సైఫ్ అలీ ఖాన్ ఘటనపై మహారాష్ట్ర మంత్రి అనుమానం..
- ‘‘ఖాన్’’లకు కష్టం వస్తేనే ప్రతిపక్షాలు ఆందోళన చెందాతాయా..?
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో ఎందుకు స్పందించలేదు..?
- ప్రతిపక్షాలను ప్రశ్నించిన మంత్రి నితిష్ రాణే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై కత్తి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు బంగ్లాదేశీ అయిన వ్యక్తిని పోలీసులు థానేలో అరెస్ట్ చేశారు. గత గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి దొంగతనం కోసం ప్రవేశించిన, మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే దుండగుడు, సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆయనకు ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. సైఫ్ వెన్నెముకలో కత్తి విరిగి ఉండటంతో దానిని తీయడానికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కొలుకున్నారు.
Also Read
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
అయితే, ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయివస్తున్న విధానంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి, ఆరోగ్యంగా కనిపించడంపై పలువురు కీలక వ్యాఖ్యలు చేశారు. సైఫ్ అలీ ఖాన్ వ్యవహారంపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణా మాట్లాడుతూ.. ‘‘ఈ సంఘటన నిజామా లేదా, ఆయన నటిస్తున్నారా..?’’ అని అనుమానించారు. అతను డిశ్చార్జ్ అయిన తర్వాత చూసినప్పుడు, అతడిపై నిజంగా కత్తి దాడి జరిగిందా..? అనే అనుమానం వచ్చినట్లు చెప్పారు.
ఒక ‘‘ఖాన్’’ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష నాయకులు నటుడి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి మద్దతుగా ఎన్సీపీ నేత జితేంద్ర అవాద్, ఎంపీ సుప్రియా సూలేలు ఎందుకు రాలేదని అడిగారు. షారూఖ్ ఖాన్ కుమారుడి గురించి నవాబ్ మాలిక్, సైఫ్ అలీ ఖాన్ గురించి సుప్రియా సూలే ఆందోళన చెందుతున్నారని, హిందూ నటుడు గురించి ఎప్పుడైనా ఆందోళన చెందారా..? అని అడిగారు.
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!