Tamilisai Soundararajan: శారీరకంగా, మానసికంగా ధృడమైన పిల్లలు పుట్టేందుకు గర్భిణులు ‘సుందర కాండ’ పఠించాలని, ‘రామాయణం’ వంటి పురాణాలు చదవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆదివారం అన్నారు. స్వతగా వైద్యురాలు అయిన తమిళసై ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ నిర్వహిస్తున్న ‘గర్భ సంస్కార్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సంవర్థినీ న్యాస్ ‘ గర్భ సంస్కార్’ కార్యక్రమం కింద వైద్యులు ‘శాస్త్రీయ, సాంప్రదాయ’ మందుల మిశ్రమాన్ని తల్లులకు అందిస్తారు.
Read Also: Amit Shah: కాంగ్రెస్, డీఎంకేలు 2G, 3G, 4G పార్టీలు.. అమిత్ షా ఫైర్
తల్లులకు భగవద్గీత వంటి మతపరమైన గ్రంధం చదవడంతో పాటు సంస్కృత మంత్రాలను పఠించడం, యోగా సాధన వంటివి నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ గర్భధారణకు ముందు నుండి ప్రసవ దశ వరకు ప్రారంభమవుతుంది. శిశువుకు రెండు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో కాబోయే తల్లుల కుటుంబ సభ్యులకు కూడా మార్గనిర్దేశం చేస్తారు. ఈ కార్యక్రమం సంవర్థినీ న్యాస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు సమాంతరంగా ఉండే మహిళా సంస్థ.
ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రారంభించిన తమిళిసై.. ‘గర్భ సంస్కార్’ ప్రోగ్రాం ద్వారా సంవర్ధినీ న్యాస్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. గర్భధారణ సమయంలో ‘‘శాస్త్రీయ మరియు సంపూర్ణ విధానం’’ అమలు చేయడం వల్ల ఖచ్చితంగా సానుకూల ఫలితాలు లభిస్తాయని అన్నారు. గ్రామాల్లో, రామాయణం, మహాభారతం మరియు ఇతర ఇతిహాసాలతో పాటు మంచి కథలను చదివే తల్లులను మనం చూశాము, ముఖ్యంగా తమిళనాడులో, గర్భిణీ స్త్రీలు కంబ రామాయణంలోని సుందరకాండాన్ని నేర్చుకోవాలనే నమ్మకం ఉందని ఆమె అన్నారు. గర్భధారణ సమయంలో తల్లులు సుందరకాండను పఠించడం చాలా మంచిదని ఆమె అన్నారు. సుందరకాండ, రామాయణంలో ఒక అధ్యాయం. ఇది హనుమంతుడి సాహసాలను, బలం, రాముడి పట్ల భక్తిని వర్ణిస్తుంది. గర్భధారణ సమయంలో యోగా సాధన గర్భంలో ఉన్న తల్లి, బిడ్డ ఇద్దరి శారీరక, మానసిక క్షేమాన్ని అందిస్తుందని ఆమె అన్నారు.