RBI Set To Launch Retail Digital Rupee: రిలైట్ డిజిటల్ రూపీ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఆర్‌బీఐ సిద్ధమైంది. పర్సన్ టూ పర్సన్, పర్సన్ టూ మర్చంట్ ఇలా డిజిటల్ రూపాయిలో లావాదేవీలు ప్రారంభించనుంది ఆర్‌బీఐ. కస్టమర్స్ డిజిటల్ వాలెట్ల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీ కార్యక్రమంలో పాల్గొనే బ్యాంకులకు చెందిన డిజిటల్ వాటెట్ల ద్వారా మాత్రమే డిజిటల్ రూపాయితో లావాదేవీలు జరగనున్నాయి. గురువారం నుంచి కొన్ని నగరాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
Read Also: Government Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో 16,940 పోస్టులకు నోటిఫికేషన్లు రెడీ..!
రిటైల్ డిజిటర్ రూపాయి కూడా కాగితం కరెన్సీ, నాణేలా లాగే అదే డినామినేషన్లలో అందుబాటులో ఉంటుంది. రూ.2000, రూ. 500, రూ. 200, రూ.100 ఇలా డిజిటల్ రూపాయి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు డిజిటల్ వాలెట్ల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. అయితే ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీ డ్రైవ్ లో పాల్గొనే బ్యాంకులు అందించే వాలెట్ల ద్వారానే రిటైల్ డిజిటర్ రూపాయి లావాదేవీలు జరపవచ్చు. పర్సన్ టూ పర్సన్, పర్సన్ టూ మర్చంట్ లావాదేవీలు చేయవచ్చు. వ్యాపార సంస్థల వద్ద ఉంటే క్యూఆర్ కోడ్ ఉపయోగించి వ్యాపారులకు చెల్లింపులు చేయవచ్చు. నగదు మాదిరిగానే రిటైల్ డిజిటర్ రూపాయిలో విశ్వాసం, భద్రత హమీలను కల్పించబడుతాయి. వాలెట్లలో ఉన్న డిజిటర్ కరెన్సీకి ఎలాంటి వడ్డీని పొందము. అయితే రిటైల్ డిజిటల్ రూపాయిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు.
ముంబై, న్యూఢిల్లీ, బెంగళూర్, భువనేశ్వర్ నగరాల్లో మొదటి దశను ప్రారంభించనున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి బ్యాంకులు మొదటి విడతలో సేవలను అందిచనున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులు రెండో విడతలో అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా, సిమ్లా నగరాల్లో సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నాయి.