NTV Telugu Site icon

RBI Receives Bomb Threat: ఆర్బీఐకి బాంబు బెదిరింపులు..

Bomb Thert

Bomb Thert

RBI Receives Bomb Threat: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చింది. ఆర్బీఐ గవర్నర్ కు ఈ మెయిల్ ద్వారా పంపిన బెదిరింపుల్లో బ్యాంకును పేల్చివేస్తామంటూ రష్యన్‌ భాషలో గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని పంపించారు. దీనికి సంబంధించి ముంబైలోని మట రమాబాయ్‌ మార్గ్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే, ఈ-మెయిల్ పంపిన వ్యక్తి ఆచూకీ కోసం ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Read Also: CM Chandrababu: కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం.. రెండు రోజుల కాన్ఫరెన్స్‌లో ఏం జరిగిందంటే..?

అయితే, 2024 నవంబర్ 16వ తేదీన కూడా ఆర్బీఐ కస్టమర్ కేర్ నంబర్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. అప్పుడు కాల్ చేసిన వ్యక్తి “లష్కరే-ఇ-తైబా యొక్క సీఈఓ అని పేర్కొన్నాడు. కాల్ చేయడానికి ముందు ఫోన్‌లో దుండగుడు పాట పాడినట్లు సమాచారం. కాగా, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ 2008 ముంబై దాడులను నిర్వహించింది. ఇది భారతదేశంలోని అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడులలో ఒకటిగా నిలిచింది.