Site icon NTV Telugu

UPI: యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు.. ఆర్బీఐ క్లారిటీ..

Upi

Upi

UPI: గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటన జారీ చేసింది. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించే ప్రతిపాదన లేదని రిజ్వర్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం అన్నారు. ఈఎంఐ చెల్లింపులో డిఫాల్ట్ అయితే క్రెడిట్‌పై కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్‌లను రిమోట్‌గా లాక్ చేయడానికి రుణదాతలను అనుమతించే ప్రతిపాదనపై ఆర్బీఐ పరిశీలిస్తోందని గవర్నర్ అన్నారు.

Read Also: 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ AI కెమెరా, IP69 రేటింగ్‌తో Realme 15x 5G లాంచ్.. ధర ఎంతంటే?

ఫోన్‌ల డిజిటల్ లాకింగ్ కు సంబంధించి లాభాలు, నష్టాలు రెండింటిని పరిశీస్తున్నామని RBI డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు చెప్పారు. కస్టమర్ల హక్కులు, అవసరాలు, డేటా ప్రైవసీ, రుణదాతల అవసరాలను కూడా ప్రాధాన్యత ఇస్తూ రెండు వైపుల లాభాలు నష్టాలు ఉన్నాయని చెప్పారు. దీనిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిందని, ద్రవ్య విధాన సడలింపుకు అవకాశం కల్పిస్తుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. దేశం ఆర్థిక వ్యవస్థపై ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తూ.. ఆర్థిక సంవత్సరం 2026 మొదటి అర్థభాగంలో జీడీపీ అంచనాలు 6.8 శాతానికి పెంచారు.

Exit mobile version