NTV Telugu Site icon

Rivaba Jadeja: భారీ విజయం దిశగా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.. లీడింగ్‌లో “మోర్బీ” హీరో

Rivaba Jadeja

Rivaba Jadeja

Ravindra Jadeja’s wife Rivaba Jadeja is on the way to huge win: గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ 150కి పైగా స్థానాల్లో విజయం సాధించబోతోంది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ 154 స్థానాల్లో, కాంగ్రెస్ 20, ఆప్ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే బీజేపీ నుంచి పోటీ చేసిన ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఎన్నికల సంఘం అధికారిక ట్రెండ్స్ ప్రకారం జామ్ నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గంలో రివాబా ఏకంగా 30,000కు పైగా మెజారిటీలో కొనసాగుతున్నారు. దాదాపుగా ఆమె విజయం ఖరారైంది.

Read Also: Bandi Sanjay: తెలంగాణలో కూడా గుజరాత్ ఫలితమే పునరావృతమవుతుంది

నన్ను తమ అభ్యర్థిగా అంగీకరించినందుకు సంతోషంగా ఉందని.. తన కోసం పనిచేసిన ప్రజలకు, ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు రివాబా జడేజా. గత 27 ఏళ్లుగా బీజేపీ గుజరాత్ రాష్ట్రంలో పనిచేసిన విధంగానే, గుజరాత్ మోడల్ అభివృద్ధి పద్ధతిలోనే బీజేపీ సాగుతుందని ప్రజలు విశ్వసించారని.. గుజరాత్ బీజేపీతోనే ఉందని, బీజేపీ గుజరాత్ ప్రజలతోనే కొనసాగుతుందని ఆమె అన్నారు.

ఇదిలా ఉంటే గుజరాత్ ఎన్నికల కన్నా ముందు మోర్బీ ఘటన యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వంతెన కూలి ఏకంగా 130 కన్నా ఎక్కువ మంది మరణించారు. ఈ ఘటనలో నీటిలో పడిన చాలా మందిని కాపాడి హీరోగా నిలిచారు కాంతిలాల్ అమృతియా. అతనికి బీజేపీ మోర్బీ టికెట్ కేటాయించింది. ప్రస్తుతం కాంతిలాల్ అమృతియా భారీ మెజారిటీ దిశగా వెళ్తున్నారు. ఇప్పటికే ఆయన 37 వేల ఓట్లు సంపాదించారు. తన సమీపప్రత్యర్థి ఆప్ అభ్యర్థిపై 8 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Show comments