NTV Telugu Site icon

Prajwal Revanna: “గన్ చూపించి రేప్..రేప్ చేస్తున్నంత సేపు నవ్వాలి”..

Prajwal Revanna

Prajwal Revanna

Prajwal Revanna: జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో సిట్ దూకుడు పెంచింది. అతడిపై మూడో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వందలాది సె*క్స్ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. హసన్ జిల్లాలో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. మరోవైపు రేవణ్ణ ఇంట్లో పనిచేసే మహిళ తనపై ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉంటే, సిట్ శుక్రవారం ఎమ్మెల్యేలు/ఎంపీల కోసం ప్రత్యేక కోర్టుకు సమర్పించిన 1,691 పేజీల ఛార్జిషీట్‌లో ప్రజ్వల్ రేవణ్ణ బాధితురాలిపై ఎంత కర్కషంగా ప్రవర్తించాడనే విషయాలను వెలుగతులోకి తెచ్చింది. ఛార్జిషీట్ ప్రకారం.. బాధిత మహిళను ప్రజ్వల్ రేవణ్ణ లోదుస్తులు ధరించమని బలవంతం చేశాడు. బాధితురాలిపై 2020 నుంచి 2023 వరకు తుపాకీతో బెదిరించి పదేపదే అత్యాచారం చేశాడు. ప్రజ్వల్ రేవణ్ణ ఈ శృంగారాన్ని చిత్రీకరించే వాడని, ఎవరితో అయినా చెబితే ఫుటేజీ విడుదల చేస్తానని బెదిరించే వాడని ఆమె ఆరోపించారు.

READ ALSO: Horseshoe Crab: 45 కోట్ల ఏళ్లుగా భూమిపై జీవి.. 1 లీటర్ రక్తం ధర రూ.12.58 లక్షలు!

ప్రజ్వల్ రేవణ్ణ హోలెనరసిపురా నివాసంలోని మూడో అంతస్తులోని ఒక గదిలో అత్యాచారం జరిగిందని, ప్రతీ సారి బెదిరించడానికి వీడియోని చిత్రీకరించే వాడని తెలిసింది. అత్యాచారం చేస్తున్న సమయంలో నవ్వాలని బాధిత మహిళని బలవంతం చేసేవాడు. ప్రజ్వల్ రేవణ్ణ, బాధితురాలి మధ్య సంబంధాన్ని చూసిన ఒక ఎమ్మెల్యే, వారిద్దరు హాజరైన ఒక కార్యక్రమంలో బాధితురాలిని నిరంతరం సంప్రదించాడని, ఆ తర్వాత ఆమెపై అఘాయిత్యం జరిగిన గెస్ట్‌హౌజ్‌కి రావాలని బలవంతం చేశాడని వాంగ్మూలం ఇచ్చాడు.

సిట్ 120 మంది సాక్షులను విచారించింది , బాధితుల వివరణాత్మక వాంగ్మూలంతో సహా విస్తృతమైన సాక్ష్యాలను సేకరించింది. ప్రజ్వల్ సెక్షన్లు 376 (2) N (పదేపదే అత్యాచారం), 506 (నేరపూరిత బెదిరింపు), 354 (A) (1) (అసహ్యమైన లైంగిక ప్రవర్తన), 354 (B) (నేర బలాన్ని ఉపయోగించడం) వంటి చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు సెప్టెంబర్ 19న తదుపరి విచారణ చేపట్టనుంది.

Show comments