Ranveer singh: ధురంధర్ సక్సెస్.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను కలిసిన రణవీర్ సింగ్..

  • ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన రణ్‌వీర్ సింగ్..
  • ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో భేటీ..
  • ధురంధర్ సక్సెస్ తర్వాత కీలక పరిణామం..
Ranveer Singh

Ranveer Singh

Ranveer singh: బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన ‘‘ధురంధర్2’’ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను సాధిస్తోంది. గతంలో ఉన్న రికార్డులు ధురంధర్ దెబ్బక బద్దలవుతున్నాయి. ధురంధర్ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న రణవీర్ సింగ్, (RSS) అధిపతి మోహన్ భగవత్‌ను కలిసేందుకు శుక్రవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్లారు.

Read Also: Mojtaba Khamenei: ఇరాన్‌కు గుడ్ న్యూస్.. కోలుకుంటున్న మొజ్తబా ఖమేనీ..

నివేదికల ప్రకారం, రణవీర్ సింగ్ శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నాగ్‌పూర్‌లో ల్యాండ్ అయ్యారు. అక్కడ నుంచి నేరుగా ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడే ఆయన గంటన్నర పాటు గడిపారు. ఈ సమావేశంలో మోహన్‌ భగవత్‌తో తన లెటెస్ట్ మూవీ ధురంధర్ విశేషాలను పంచుకున్నారు. ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు, క్షేత్రస్థాయి కార్యక్రమాలను గురించి తెలుసుకున్నారు. ప్రధాన కార్యాలయం తర్వాత, రేషింబాగ్‌లోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిరాన్ని కూడా సందర్శించారు. అక్కడ ఆయన ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కె.బి. హెడ్గేవార్, సర్సంఘచాలక్ ఎం.ఎస్. గోల్వాల్కర్‌లకు నివాళులర్పించారు.