Site icon NTV Telugu

UP: నాటక ప్రదర్శనలో షాకింగ్ ఘటన.. స్టేజ్‌పై కొట్టుకున్న నటులు

Up

Up

విజయదశమి సందర్భంగా శనివారం ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలోని రామలీలాలో గ్రౌండ్‌లో నాటక ప్రదర్శన నడుస్తోంది. ఆసక్తిగా సాగుతున్న తరుణంలో ఒక్కసారిగా నటులు భౌతికదాడులకు దిగారు. దీంతో ప్రేక్షకులు వెళ్లి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: స్టార్టప్ ఆంధ్ర నినాదం మాత్రమే కాదు… పాలనా విధానాన్ని మార్చే ఆయుధం

ఉత్తరప్రదేశ్‌లోని రామలీలా గ్రౌండ్‌లో రామ్, రావణ డ్రామా నడుస్తోంది. నటులు ప్రదర్శన ఇస్తుండగా.. అంతలోనే నిజంగా పోరాటానికి దిగారు. నటులు రాముడు, లక్ష్మణుడు, రావణుడు విల్లంబులు, బాణాలతో మాక్ ఫైట్‌లో పాల్గొన్నారు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ ఆర్టిస్టులు నిజమైన పోరాటానికి దిగారు. దీంతో ప్రేక్షకులు ఖంగుతిన్నారు. పైకి వెళ్లి విడిపించారు. సచిన్ గుప్తా అనే వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 11,000 మంది వీక్షించారు. అంతేకాకుండా ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటున్నారని కామెంట్లు పెట్టారు.

ఇది కూడా చదవండి: Matka: లే లే రాజా అంటున్న నోరా.. సాంగ్ భలే ఉందే

Exit mobile version