Site icon NTV Telugu

Ram Temple Event: రామ మందిర వేడుకకు వచ్చే అతిథులు వీరే.. జాబితాలో రతన్ టాటా, రజినీ కాంత్, చిరంజీవి, కోహ్లీ

Ram Mandir

Ram Mandir

Ram Temple Event: రామ మందిర ప్రారంభోత్సవాన్ని చూసేందుకు యావత్ దేశం సిద్ధమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమం జరగబోతోంది. జనవరి 16 నుంచి జనవరి 21 వరకు ప్రత్యేక ఆచారాలు కొనసాగుతాయి. ప్రధాని కార్యక్రమం జనవరి 22న జరుగుతుంది. జనవరి 22 మధ్యాహ్నం 12.20 నుంచి ప్రారంభమై 1 గంట వరకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. 121 మంది పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రధాని పురోహితుడిగా కాశీకి చెందిన లక్ష్మీకాంత దీక్షితులు పాల్గొంటారు.

అయోధ్య రామ మందిర ముఖ్య అతిథులు:

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బిఎపిఎస్ స్వామినారాయణ సంస్థ, ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, అఖిలేష్ యాదవ్, మల్లికార్జున్ ఖర్గే (ఆహ్వానం తిరస్కరించారు), సోనియా గాంధీ (ఆహ్వానం తిరస్కరించారు), అధీర్ రంజన్ చౌదరి (ఆహ్వానం తిరస్కరించారు), మన్మోహన్ సింగ్

పారిశ్రామికవేత్తలు:
గౌతమ్ అదానీ, రతన్ టాటా, ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా, ఎన్ చంద్రశేఖరన్, అనిల్ అగర్వాల్, ఎన్ఆర్ నారాయణ మూర్తి

సినీ ప్రముఖులు:

మోహన్‌లాల్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, మాధురీ దీక్షిత్, చిరంజీవి, సంజయ్ లీలా భన్సాలీ, అక్షయ్ కుమార్, ధనుష్, రణ్‌దీప్ హుడా, రణ్‌బీర్ కపూర్, కంగనా రనౌత్, రిషబ్ శెట్టి, మధుర్ భండార్కర్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్ అజయ్ దేవగన్, యష్, ప్రభాస్, ఆయుష్మాన్ ఖురానా, అలియా భట్, సన్నీ డియోల్.

క్రీడాకారులు:

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని , దీపికా కుమారి. వీరితో పాటు సాధువులు, పలు రంగాల్లో కృషి చేసిన వారిని, కరసేవ చేసిన వారితో సహా 7000 మంది హాజరయ్యే అవకాశం ఉంది.

Exit mobile version