Site icon NTV Telugu

Rajya Sabha Polls: జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు.. పెరగనున్న ఇండియా కూటమి బలం

Rajyasabhapolls

Rajyasabhapolls

దేశంలో మరోసారి రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 19న అస్సాం, తమిళనాడులో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అస్సాంలో రెండు, తమిళనాడులో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం 8 స్థానాలకు పోలింగ్ తేదీ ప్రకటించింది. జూన్ 19న పోలింగ్ జరగనుంది.

ఇది కూడా చదవండి: TDP Mahanadu 2025: మరలా పెద్ద నోట్లు రద్దు చేయాలి.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఎగువ సభలో 128 ఎంపీలు ఉండగా.. ప్రతిపక్షానికి 89 మంది ఎంపీలు ఉన్నారు. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో వైసీపీ, బీఆర్ఎస్, బీజేడీ, బీఎస్పీ, ఎంఎన్‌ఎఫ్ వంటి పార్టీలకు 20 మంది ఎంపీలుండగా.. ప్రస్తుతం ఎనిమిది సీట్లు ఖాళీ అయ్యాయి.

ఇది కూడా చదవండి: Alcatel V3 Series: 108MP కెమెరా, 5200mAh బ్యాటరీ, ఆకర్షణీయమైన ధరలతో అల్కాటెల్ V3 అల్ట్రా, ప్రో, క్లాసిక్ మొబైల్స్ లాంచ్..!

అస్సాంలో గట్టి పోటీ..
అస్సాంలోని రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణ పరిషత్ (AGP)కి చెందిన బీరేంద్ర ప్రసాద్ బైశ్యా, బీజేపీకి చెందిన మిషన్ రంజన్ దాస్ పదవీకాలం జూన్ 14తో ముగుస్తుంది. అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో ప్రస్తుతం 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో బీజేపీకి చెందిన 64 మంది, ఏజీపీకి చెందిన 9 మంది, యూపీపీఎల్‌కు ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. మరోవైపు ప్రతిపక్షంలో కాంగ్రెస్‌కు చెందిన 26 మంది శాసనసభ్యులు ఉన్నారు. వీరికి సీపీఐ(ఎం) ఏకైక ఎమ్మెల్యే మద్దతు లభించే అవకాశం ఉంది. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎఐయుడీఎఫ్) చెందిన 15 మంది ఎమ్మెల్యేలు మరియు బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీడీఎఫ్) కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు లభించే అవకాశం ఉంది. వీరి మద్దతుతో కాంగ్రెస్ సంఖ్య 45కి చేరుకుంటుంది. అస్సాం అసెంబ్లీలో 126 మంది ఎమ్మెల్యేలున్నారు. రాజ్యసభ అభ్యర్థికి 42 ఓట్లు అవసరం ఉంటుంది. అయితే 80 మంది ఎమ్మెల్యేలతో రెండు సీట్లు గెలుచుకుంటామని ఎన్డీఏ ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రతిపక్షం నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వస్తారని భావిస్తోంది.

తమిళనాడు..
అన్బుమణి రామదాస్ (పట్టాలి మక్కల్ కట్చి), ఎన్ చంద్రశేఖరన్ (ఎఐఎడీఎంకే), ఎం షణ్ముగం (డీఎంకే), పి విల్సన్ (డీఎంకే), ఎం మహమ్మద్ అబ్దుల్లా (డీఎంకే), వైకో (ఎఐఎడీఎంకే) పదవీకాలం జూలై 24తో ముగియడంతో తమిళనాడులో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.

234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో.. ఇండియా కూటమికి 158 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో డీఎంకేకు చెందిన 133 మంది, కాంగ్రెస్‌కు చెందిన 17 మంది, విసికెకు చెందిన 4 మంది మరియు సీపీఐ మరియు సీపీఐ(ఎం)కు చెందిన 2 మంది ఉన్నారు. మరోవైపు, ఎన్డీఏకు 75 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎఐఎడీఎంకేకు చెందిన 66 మంది, బీజేపీకి చెందిన 4 మంది మరియు పీఎంకేకు చెందిన 5 మంది ఉన్నారు. రాజ్యసభ అభ్యర్థికి కనీసం 34 ఓట్లు అవసరం. దీనిని బట్టి 158 ఎమ్మెల్యేలతో ఇండియా కూటమి 4 సీట్లు గెలుచుకుంటుంది. 75 ఎమ్మెల్యేలతో ఎన్డీఏ రెండు సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఇక ఎన్డీఏ నుంచి అన్నామలైకు సీటు ఇచ్చే అవకాశం ఉంది. ఇక డీఎంకే నుంచి నటుడు కమల్ ‌హాసన్‌కు అవకాశం లభించే ఛాన్స్ ఉంది.

Exit mobile version