Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు

  • రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల
  • జూన్‌ 1న నోటిఫికేషన్‌
  • జూన్‌ 18న రాజ్యసభ ఎన్నికలు, అదే రోజు ఫలితాలు
Rajya Sabha 2026

Rajya Sabha 2026

రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ జూలైలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో మొత్తం 24 స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభసభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఖాళీ అవుతున్న ఈ నాలుగు స్థానాలను భర్తీ చేసేందుకు షెడ్యూల్ రిలీజ్ చేశారు. జూన్ 1న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. జూన్ 18న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నది ఎలక్షణ్ కమిషన్. కర్ణాటక నుంచి పదవీకాలం పూర్తవుతున్న రాజ్యసభ సభ్యులు.. ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, హెచ్డీ దేవగౌడ. మధ్యప్రదేశ్ నుంచి దిగ్విజయసింగ్ పదవీ కాలం ముగియనుంది.

ఖాళీ కానున్న స్థానాలు ఇవే

×
×
Ad

ఆంధ్రప్రదేశ్ లో

అయోధ్య రామిరెడ్డి

పిల్లి సుభాష్ చంద్రబోస్

పరిమల్ నత్వానీ

సాన సతీష్ బాబుల స్థానాలు

గుజరాత్ నుంచి 4

జార్ఖండ్ నుంచి రెండు

మధ్యప్రదేశ్ నుంచి మూడు

మణిపూర్ నుంచి ఒక్కటి

కర్ణాటక నుంచి 4 స్థానాలకు షెడ్యూల్ విడుదల చేశారు.