Site icon NTV Telugu

Harivansh Narayan Singh: ఎన్నికల వేళ ప్రశాంత్ కిషోర్‌పై రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ప్రశంసలు

Harivansh Narayan Singh

Harivansh Narayan Singh

బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జన్ సూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్‌పై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ప్రధాన పార్టీలు పట్టించుకోని సమస్యలను ప్రశాంత్ కిషోర్ లేవనెత్తారని.. అయితే ఆ సమస్య పరిష్కారానికి చాలా సమయం పడుతుందని తెలిపారు. అయితే ఎన్నికల్లో మాత్రం కొన్ని సీట్లు జన్ సూరాజ్ పార్టీ సాధిస్తుందని జోస్యం చెప్పారు.

ఇది కూడా చదవండి: Rivaba Jadeja: ట్రెండింగ్‌గా రివాబా జడేజా.. కారణమిదే!

జయప్రకాష్ నారాయణ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నేతృత్వంలోని సోషలిస్ట్ పార్టీ లేవనెత్తిన ప్రాథమిక ప్రజా సమస్యలు 1967 నాటికి గణనీయంగా ప్రభావితం చేశాయని గుర్తుచేశారు. అలాగే ప్రశాంత్ కిషోర్ లేవనెత్తుతున్న సమస్యలు కూడా భవిష్యత్‌లో ప్రభావం చూపిస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రశాంత్ కిషోర్ లేవనెత్తిన అంశాలను ఇతర పార్టీలు కూడా వినిపిస్తున్నాయని, కానీ అవి పెద్ద ఎత్తున వినిపించడం లేదని హరివంశ్ నారాయణ్ సింగ్ అన్నారు.

ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. నేడు ఎంత తగ్గిందంటే..!

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కలిసి పోటీ చేస్తుండగా.. ఇండియా కూటమి మాత్రం చివరి నిమిషంలో విభేదాలు కారణంగా విడివిడిగా పోటీ చేస్తోంది.

Exit mobile version