Rajnath Singh: “సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం”.. ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
- భారత షరతులకు లోబడి ఆపరేషన్ సిందూర్..
- సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం..
- ఉగ్రవాదాన్ని సహించేది లేదు..
- రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: భారత్ తన సొంత నిబంధనలు, షరతుల మేరకు ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిలిపేసిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అవసరమైతే పాకిస్తాన్‌పై దీర్ఘకాలిక యద్ధానికి భారత్ సిద్ధంగా ఉందని గురువారం ఆయన చెప్పారు. పాకిస్తాన్ అణు దాడి చేస్తామని బెదిరించిందని, కానీ భారత్ వెనకడుగు వేయలేదని ఆయన చెప్పారు. భారత్ సైన్యం అకస్మాత్తుగా బలగాలను పెంచే సర్జ్ సామర్థ్యం గతంలో కన్నా బలంగా ఉందని ఆయన తెలిపారు.
Read Also: DJ Sound: డీజే సౌండ్‌కు 140 కోళ్లు బలి.. కేసు నమోదు..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
భారత్ ఓ వైపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ఐటీకి ప్రసిద్ధి చెందుతుంటే, పాకిస్తాన్ మాత్రం అంతర్జాతీయ ఉగ్రవాదమనే ఐటీకి కేంద్రంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్ కీలక మలుపు అని, ఇది కేవలం ప్రకటన కాదని, అవసరమైతే ప్రత్యక్ష చర్యలకు దిగుతామని ప్రపంచానికి చూపించామని ఆయన అన్నారు. దేశంలో ఎలాంటి ఉగ్రవాద దాడిని సహించబోమని, అవసరమైతే కఠిన, ప్రత్యక్ష చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
గతేడాది పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా గతేడాది ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిందని రక్షణ మంత్రి చెప్పారు. భారత్ సైన్యం పాకిస్తాన్, పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం కవ్వింపులకు పాల్పడితే పాక్ ఎయిర్ ఫోర్స్ స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?