NTV Telugu Site icon

SCO Meeting: గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారిగా చైనా రక్షణ మంత్రితో చర్చలు..

Sco Meeting

Sco Meeting

Rajnath Singh holds talks with Chinese defence minister: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమావేశం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్‌ఫుతో గురువారం చర్చలు జరిపారు. 2020లో గాల్వాన్ లో భారత్-చైనా సైన్యం మధ్య ఘర్షణ అనంతరం చైనా రక్షణ మంత్రితో చర్చల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. ఢిల్లీలో ఇరుదేశాల రక్షణ మంత్రులు సమావేశం నిర్వహించారు. కజకిస్థాన్, ఇరాన్, తజికిస్థాన్ రక్షణ మంత్రులతో రాజ్‌నాథ్ సింగ్ ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించారు.

Read Also: Bandi Sanjay : బండి సంజయ్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టేసిన కోర్టు

గత ఆదివారం భారత్, చైనా మధ్య 18వ రౌండ్ కార్ప్స్ కమాండర్-స్థాయి చర్చలు జరిగాయి, రెండు దేశాలు సన్నిహితంగా ఉండటానికి మరియు తూర్పు లడఖ్‌లోని మిగిలిన సమస్యలను పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని త్వరగా రూపొందించడానికి అంగీకరించాయి. అయితే మూడేళ్లుగా ఉణ్న సైనిక ప్రతిష్టంభనకు ముగింపు పలకడంపై స్పష్టంగా ముందుకు వెళ్లే సూచనలు కనిపించడం లేదు.

మే 5, 2020న తూర్పు లడఖ్ సరిహద్దులోని పాంగాంగ్ సరస్సు ప్రాంతంలోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య భీకరదాడులు జరిగాయి. ఈ ఘర్షణల్లో భారత్ నుంచి 20 మంది సైనికులు వీరమరణం పొందారు. అయితే భారత్ సైనికులు తిరిగి జరిపిన దాడిలో 40 మందికి పైగా చైనా సైనికులు మరణించినట్లు అమెరికాతో పాటు పాశ్చాత్యదేశాలు వెల్లడించాయి. అయితే డ్రాగన్ కంట్రీ చైనా మాత్రం తమవారు నలుగురు సైనికులు మాత్రమే చనిపోయినట్లు చెబుతోంది. చైనా లఢఖ్ ప్రాంతంతో పాటు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో తరుచుగా భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోంది. గతేడాది చైనా సైనికులు తవాంగ్ సెక్టార్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సమయంలో భారత సైనికలు వారిని తరిమికొట్టారు.