Site icon NTV Telugu

బీజేపీ,ఆర్‌ఎస్‌ఎస్‌లతో దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: టికాయత్‌

బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌లతో దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాజేష్‌ టికాయత్‌ హెచ్చరించారు. దేశ ప్రజల మధ్య ఐక్యతను విడదేసేందుకు వారు ఎంతకైనా తెగిస్తారని ఆయన విమర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారం భించి ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలకు రాలేదని టికాయత్‌ ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం చర్చలకు రావాలని, లేదంటే నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని ఆయన తెలిపారు.

దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం సంక్షోభంలోకి పడేసిందని టికాయత్‌ అన్నారు. రైతులు కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు ఒప్పుకుంటే దేశానికి భారీ ముప్పు తప్ప దన్నారు. మోడీ ప్రభుత్వం ఇప్పటికే అన్ని రంగాలను ప్రైవేట్‌ పరం చేస్తుందన్నారు. రైతులు పండించే పంటలను కూడా కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తోందని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. అందుకే ఈ చట్టాలను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందని రాజేష్‌ టికాయత్‌ అన్నారు. ప్రజలు ఏమర పాటుగా ఉంటే బీజేపీ మొత్తం దేశాన్నే అమ్ముతుందని రాజేష్‌ టికాయత్‌ అన్నారు.

Exit mobile version