Site icon NTV Telugu

Mangalsutra Issue: సింధూరం, మంగళసూత్రంపై రాజస్థాన్ టీచర్ హాట్ కామెంట్స్.. ఆ వెంటనే సస్పెండ్..!

Teacher

Teacher

Mangalsutra Issue: రాజస్థాన్ లో జులై 19వ తేదీన బన్స్వారాలోని మంగర్ ధామ్‌లో ఓ ర్యాలీ జరిగింది. ఈ మెగా ర్యాలీలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలోని గిరిజన సంఘాలకు చెందిన వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేనకా దామోర్ అనే టీచర్ మాట్లాడుతూ.. పండితులు చెప్పే మాటలను గిరిజన మహిళలు పాటించొద్దని చెప్పారు. గిరిజన మహిళలు సింధూరం పెట్టుకోవద్దు, మంగళసూత్రం ధరించవద్దని బహిరంగ వేదికపై చెప్పుకొచ్చారు. దీంతో ఆమె మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారింది. ఇక, ఈ వీడియో రాజస్థాన్ విద్యాశాఖ అధికారులు దగ్గరకు చేరడంతో ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. రాజస్థాన్ ప్రవర్తనా నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు విద్యాశాఖ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడినందుకు మేనకా దామోర్‌పై చర్యలు తీసుకున్నట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

Read Also: Operation Sarp Vinash 2.0: జమ్మూకశ్మీర్లో ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0 షూరు..

అయితే, గిరిజన తెగకు చెందిన మహిళలు, బాలికలు చదువుపై దృష్టి సారించాలి అని మేనకా దామోర్ వ్యాఖ్యనించారు. మనమేమీ హిందువులం కాదు.. ఈ ఆచార వ్యవహారాలన్నీ పాటించాల్సిన అవసరం లేదన్నారు. ఇక, దామోర్ వ్యాఖ్యలపై గిరిజన సంఘం మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, ఆదివాసీ పరివార్ సంస్థను మేనకా దామోర్ స్థాపించింది.

Exit mobile version