Ganesh Chaturthi: రాజస్థాన్ కోటా జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ వాట్సాప్ గ్రూపులో వచ్చిన ‘‘గణేష్ చతుర్థి శుభాకాంక్షలు’’ అనే పలు పోస్టులను డిలీట్ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాటూరిలోని ప్రభుత్వం హయ్యర్ సెకండరీ స్కూల్ కమిటీకి చెందిన వాట్సాప్ గ్రూపులో ఆ గ్రామస్తులు కూడా ఉన్నారు.
అయితే, గణేష్ చతుర్థి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ గ్రామస్తుడు ఒకరు శనివారం గ్రూపులో సందేశాన్ని పోస్ట్ చేశాడు. అయితే, స్కూల్ ప్రిన్సిపాల్ షఫీ మహ్మద్ అన్సారీ ఆ మెసేజ్‌ని తొలగించడం వివాదాస్పదమైంది. దాదాపుగా రెండు గంటల తర్వాత ఓ టీచర్ కూడా ఇలాగే శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ పెడితే దానిని కూడా సదరు ప్రిన్సిపాల్ డిలీట్ చేశాడు.
Read Also: Viral Video : నెక్ట్స్ లెవెల్ సెక్యూరిటీ.. కూతురు తలపై సీసీకెమెరా అమర్చిన తండ్రి.. వీడియో వైరల్
దీంతో గ్రామస్తులు అన్సారీని తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు అన్సారీపై ఫిర్యాదు చేయడంతో, శాంతి భద్రతలకు భంగం కలిగించాడని ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అతడిని అరెస్ట్ చేశారు.