Site icon NTV Telugu

Rajasthan: ఢిల్లీ ఎర్రకోట పేలుడు లాగే, కారులో పేలుడు పదార్థాలు స్వాధీనం..

Rajasthan

Rajasthan

Rajasthan: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ దాడి ఘటన మరవక ముందే, రాజస్థాన్‌లో కారులో భారీగా పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. యూరియా ఎరువుల సంచులలో దాచి ఉంచిన 150 కిలోల అక్రమ అమ్మోనియం నైట్రేట్‌తో నిండిన ఒక మారుతి సియాజ్ కారును బుధవారం రాజస్థాన్‌లోని టోంక్‌లో గుర్తించారు. ఈ వాహనంలో సుమారు 200 కాట్రిడ్జెస్, ఆరు కట్టల సెఫ్టీ ఫ్యూజ్ వైర్ లభించింది. రాజస్థాన్‌లోని బూంది నుంచి టోంక్‌కు పేలుడు పదార్థాలు సరఫరా అవుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అనుమానాస్పదంగా ఉన్న కారును పట్టుకున్నారు. ఈ కేసులో సురేంద్ర మోచి, సురేంద్ర పట్వా అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు.

Read Also: Delivery Partners: ఫుడ్ లవర్స్ కు జొమాటో-స్విగ్గీ షాక్.. డెలివరీ బాయ్స్ కు మాత్రం పండగే..

తెల్లటి స్ఫటికాకారంగా ఉంటే రసాయనమైన అమ్మోనియం నైట్రేట్‌ను ఎరువుగా విస్తృతంగా ఉపయోగిస్తారు. దీనిని గత నెలలో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బ్లాస్ట్‌లో వాడారు. ఈ ఘటనలో 15 మంది మరణించారు. ఆత్మాహుతి బాంబర్ ఉమర్ నబీ పేలుడులో మరణించాడు. ఈ ఘటన తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీకి చెందిన డాక్టర్లు ఈ ఉగ్ర మాడ్యుల్‌లో భాగంగా ఉన్నట్లు తెలిసింది. ఫరీదాబాద్‌లో ఏకంగా 2900 కిలోల పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Exit mobile version