Site icon NTV Telugu

Rajasthan: గొర్రెకు కోటి రూపాయల ఆఫర్.. తిరస్కరించిన యజమాని.. ఎందుకంత ప్రత్యేకం..?

Rajasthan

Rajasthan

Rajasthan: బక్రీద్ పండగ వచ్చింది. దీంతో మేకలకు, గొర్రెలకు విపరీతమై డిమాండ్ ఏర్పడింది. గతంలో పోలిస్తే పండగ సీజన్ కావడంతో మేకలు, గొర్రెల్లో వేల రూపాయల ధర పలుకుతున్నాయి. అయినా కూడా కొనేందుకు ముస్లింలు మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ లో ఓ వ్యక్తికి చెందిన గొర్రె పిల్లకు ఏకంగా రూ. 1 కోటి ధర పలికింది. అయినా కూడా ఈ గొర్రెను అమ్మేందుకు దాని యజమాని రాజు సింగ్ తిరస్కరించారు.

Read Also: UCC: యూసీసీపై ప్రధాని కీలక వ్యాఖ్యలు.. అర్ధరాత్రి ముస్లిం లాబోర్డు అత్యవసర సమావేశం..

రాజస్థాన్ రాష్ట్రంలోని చురు జిల్లా తారానగర్‌ కి చెందిన రాజు సింగ్ కు సంబంధించిన ఓ గొర్రె పిల్లను వేలం వేయగా ఏకంగా కోటి రూపాయల ధర పలికింది. అయితే దాన్ని అమ్మేందుకు మాత్రం అతను నిరాకరించాడు. గొర్రె తనకు ఎంతో ప్రియమైందని, కాబట్టి దీన్ని అమ్మలేనని ఆయన అన్నారు. ఇప్పుడు ఇది తారానగర్ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ గొర్రెపిల్ల శరీరంపై ఉన్న 786 అనే అంకె ముస్లింలకు చాలా పవిత్రమైనది. ఇస్లాంలో ఈ అంకెకు చాలా ప్రాధాన్యం ఉంది. గొర్రెపిల్ల శరీరంపై ఉన్నది ఎంటో తెలియదని యజమాని రాజు సింగ్ తెలిపారు. ముస్లిం వర్గానికి చెందిన కొందర్ని సంప్రదిస్తే ఈ విషయం తెలిసిందని ఆయన చెప్పారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైనది అయినప్పటికీ.. ఈ గొర్రె అంటే తనకు చాలా ఇష్టం అని అందుకే దీన్ని అమ్మడం లేదని చెప్పాడు. గతేడాది ఓ ఆడగొర్రెకు ఈ గొర్రెపిల్ల జన్మించింది. వేలం వేస్తున్న సమయంలో ఏకంగా రూ.70 లక్షలు నుంచి కోటి రూపాయలు ఇస్తామన్నారని తెలిపాడు. గొర్రె పిల్లకు భారీ ధర రావడంతో ఇప్పుడు రాజు సింగ్ దాన్ని ప్రత్యేక శ్రద్ధతో చూస్తున్నాడు. దానికి దానిమ్మ, బొప్పాయి, మినుములు, పచ్చి కూరగాయలను ఆహారంగా ఇస్తున్నాడు. భద్రతా కారణాలతో ఇప్పుడు ఆ గొర్రెను తన ఇంటిలోనే ఉంచుతున్నాడు.

Exit mobile version