NTV Telugu Site icon

Triple Talaq: పాకిస్తానీ మహిళను పెళ్లి చేసుకునేందుకు భార్యకు ‘‘ట్రిపుల్ తలాక్’’

Triple Talaq

Triple Talaq

Triple Talaq: రాజస్థాన్‌కి చెందిన వ్యక్తి పాకిస్తాన్ మహిళను పెళ్లి చేసుకునేందుకు భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పాడు. కువైట్‌లో నుంచి అతను భార్యకు ఫోన్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పినందుకు 35 ఏళ్ల వ్యక్తిని జైపూర్ విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. రెహ్మన్ అనే వ్యక్తి పాక్‌కి చెందిన మెహ్విష్‌ని సోషల్ మీడియాలో కలిశాడు. ఆమెను సౌదీ అరేబియాలో వివాహం చేసుకున్నాడు. ఆమె గత నెలలో టూరిస్ట్ వీసాపై రాజస్థాన్ చురులోని తన అత్తగారి ఇంటికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Read Also: Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో సీబీఐ విచారణ మొదలు.. కీలకంగా 6 అంశాలు..

హనుమాన్‌గఢ్‌లోని భద్ర నివాసి ఫరీదా భానో(29) గత నెలలో తన భర్త రెహ్మాన్ వరకట్న వేధింపులు, ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చినట్లు ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని హనుమాన్‌గఢ్ డిఎస్పీ రణ్‌వీర్ సింగ్ చెప్పారు. సోమవారం కువైట్ నుంచి జైపూర్ విమానాశ్రయంలో దిగిన ఇతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ తర్వాత మరుసటి రోజు అతడిని అరెస్ట్ చేశారు. రెహ్మాన్ మరియు ఫరీదా బానో 2011 లో వివాహం చేసుకున్నారని, ఇప్పుడు ఒక కొడుకు మరియు కుమార్తె ఉన్నారు. రెహ్మాన్ జీవనోపాధి కోసం కువైట్ వెళ్లి అక్కడ రవాణా రంగంలో పనిచేస్తున్నాడు.