Site icon NTV Telugu

రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యంః టీకా వేయించుకున్న వారికే రోడ్డుమీద‌కు అనుమ‌తి…

క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డాలి అంటే వ్యాక్సిన్ వేయించుకోవ‌డం ఒక్క‌టే మార్గం.  తప్ప‌ని స‌రిగా ప్ర‌తి ఒక్కరూ టీకా తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి.  టీకాల విష‌యంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధ‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.  రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం టీకా విష‌యంలో కీల‌కమైన‌, క‌ఠిన‌మైన నిర్ణ‌యం తీసుకున్న‌ది.  సోమ‌వారం నుంచి ప్ర‌జలు బ‌హిరంగ ప్ర‌దేశాల్లోకి రావాలి అంటే త‌ప్ప‌ని స‌రిగా ఒక డోసు టీకా తీసుకొని ఉండాల‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.  

Read: 7 రొటీన్ స్టెప్స్ తో గ్లాస్ స్కిన్ గ్లో…!

టీకాలు వేయించుకున్న 60శాతం మంది సిబ్బందితో జిమ్‌లు, రెస్టారెంట్లు, టీకాలు వేయించుకున్న సిబ్బందితో వ్యాపార సంస్థ‌లు తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.  అయితే, ఇప్పుడు టీకాలు తీసుకున్న ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే బ‌హిరంగ ప్రదేశాల్లోకి అనుమ‌తి ఇస్తామ‌ని ప్ర‌భుత్వం చెప్ప‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.   ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై నాయ‌కులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

Exit mobile version