Site icon NTV Telugu

10th Result: టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన బాలిక.. 600కు గాను 594 మార్కులు

10th Result1

10th Result1

దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో బోర్డు ఎగ్జామ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీబీఎస్, అలాగే ఆయా స్టేట్స్‌కు సంబంధించిన బోర్డు ఎగ్జామ్స్ అయిపోవడం.. ఫలితాలు కూడా వచ్చేస్తున్నాయి. మంగళవారం రాజస్థాన్ 10వ తరగతి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఈ ఫలితాల్లో బాలికలు అద్భుతమైన సత్తాను చాటారు. టాప్ ర్యాంక్‌ను బాలికనే సొంతం చేసుకుంది. 99 శాతం మార్కులతో చేష్ట శర్మ అనే బాలిక స్టేట్ ఫస్ట్‌తో చరిత్ర సృష్టించింది. 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది.

ఇటీవల రాజస్థాన్‌లో లక్షలాది మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఇక ఫలితాల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. త్వరగానే వారి నిరీక్షణ ఫలించింది. రాజస్థాన్ ప్రభుత్వం మంగళవారం ఉదయం టెన్త్ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల్లో విజయం సాధించడంతో పిల్లలతో తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోయారు. స్వీట్లు పంచుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. అయితే ఈ ఫలితాల్లో చేష్ట శర్మ 594 మార్కులు సాధించడంతో రాష్ట్ర ప్రజలను ఆశ్చర్య పరిచింది. యావత్ రాజస్థాన్‌కే కీర్తి తెచ్చిందని రాజస్థానీయులు ప్రశంసిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Iran War: ఇరాన్ యుద్ధం, మధ్యవర్తిగా పాకిస్తాన్.. ఇస్లామాబాద్‌‌లో చర్చలు..!

Exit mobile version