Site icon NTV Telugu

Sanjay Raut: వారిద్దరిది భావోద్వేగం మాత్రమే.. ఇంకా రాజకీయ పొత్తు లేదు..

Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut: మహారాష్ట్రలో ‘‘హిందీ వివాదం’’ నేపథ్యంలో విడిపోయిన రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు కలిసి పోతున్నారనే టాక్ నడుస్తోంది. ఇటీవల, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. తనకు ఉద్ధవ్‌కి మధ్య ఉన్నవి చిన్న విభేదాలే అని, మహారాష్ట్ర ప్రయోజనాలు పెద్దవి అంటూ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం విభేదాలను పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు.

Read Also: Suicide: మరో యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ గేమ్స్.. షర్ట్‌పై కీలక అంశం రాసి సూసైడ్..

అయితే, రాజ్‌ఠాక్రే కామెంట్స్‌పై శివసేన ఠాక్రే నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలవి కేవలం భావోద్వేగ కామెంట్స్ మాత్రమే అని అన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి రాజకీయ కూటమి లేదని, భావోద్వేగ చర్చలు మాత్రమే జరుగుతున్నాయని సంజయ్ రౌత్ అన్నారు. రాజకీయ రంగంలో ఇద్దరు నేతలు చేతులు కలిపే అవకాశాన్ని రౌత్ పూర్తిగా కొట్టిపారేయలేదు, భవిష్యత్ పొత్తులు వారిద్దరి నిర్ణయంపై ఉంటాయని అన్నారు. ‘‘రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే సోదరులు, మేము అనేక ఏళ్లుగా కలిసి ఉన్నాము. మా సంబంధం తెగిపోలేదు. ఇద్దరు సోదరులు నిర్ణయం తీసుకుంటారు’’ అని సంజయ్ రౌత్ అన్నారు.

ఇటీవల చిత్రనిర్మాత మహేష్ మంజ్రేకర్‌ పాడ్‌కాస్ట్‌లో రాజ్ ఠాక్రే మాట్లాడుతూ, “నేను ఉద్ధవ్ (ఠాక్రే)తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఆయన కూడా నాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అనేది మాత్రమే ప్రశ్న” అని ఆయన అన్నారు. ఈ కామెంట్స్ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. బీజేపీ ముసుగులో మహారాష్ట్ర వ్యతిరేక శక్తుల నుంచి తాను దూరంగా ఉండాలని రాజ్ ఠాక్రేని కోరారు.

Exit mobile version