Site icon NTV Telugu

Raj Thackeray: ఉద్ధవ్ ఠాక్రేకి బీజేపీ చెక్.. రాజ్ ఠాక్రేతో అమిత్ షా భేటీ..

Raj Thackeray

Raj Thackeray

Raj Thackeray: మహారాష్ట్ర పరిణామాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మెజారిటీ ఎంపీ సీట్లను కైవసం చేసుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఉద్ధవ్ ఠాక్రేకి చెక్ పెట్టేందుకు బీజేపీ భారీ ప్లాన్ సిద్ధం చేసింది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్, ఉద్ధవ్ ఠాక్రే కజిన్ రాజ్ ఠాక్రేని రంగంలోకి దించింది. ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్ ఠాక్రేతో భేటీ కావడంతో ఈ బీజేపీతో ఎంఎన్ఎస్ పొత్తు ఖరారైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎంఎన్ఎస్ దక్షిణ ముంబై, షిర్డీ, నాసిక్ స్థానానాలను డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రాజ్ ఠాక్రే తన తన కుమారుడు అమిత్ ఠాక్రేతో కలిసి ఢిల్లీలో అమిత్ షాతో సమావేశమయ్యారు. ఎంఎన్ఎస్ నాయకుడు సందీప్ దేశ్‌పాండే మాట్లాడుతూ.. ఏ నిర్ణయం తీసుకున్నా అది మరాఠీలు, హిందుత్వ ప్రయోజనాల కోసమే అని అన్నారు. దీంతో ఎన్డీయే కూటమిలో ఎంఎన్ఎస్ పార్టీ చేయడం దాదాపుగా ఖాయమైనట్లు తెలస్తోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే కూడా దేశ రాజధానిలో ఉన్నట్లు సమాచారం.

Read Also: Supreme Court: CAAపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ.. 3 వారాల్లో స్పందించాలని కేంద్రానికి ఆదేశం..

రాజ్ ఠాక్రేతో ఉద్ధవ్ ఠాక్రేకి చెక్:

2019లో శివసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాయి. మహారాష్ట్రలోని 48 స్థానాల్లో 41 సీట్లు గెలుచుకుంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం ఇరు పార్టీల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. దీంతో బీజేపీని కాదని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో జతకట్టి ‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’ కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే 2022లో ఏక్ నాథ్ షిండే శివసేనలో తిరుగుబాటు తీసుకువచ్చాడు. మెజారిటీ ఎమ్మెల్యేలు షిండే వైపు ఉండటంతో ప్రభుత్వం పడిపోయి, మళ్లీ బీజేపీ, షిండే నేతృత్వంలోని శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మరోవైపు, ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు చేసి ఆయన వర్గం కూడా బీజేపీ ప్రభుత్వంలో చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ-శివసేన(షిండే)- ఎన్సీపీ(అజిత్ పవార్) కూటమి అధికారంలో ఉంది.

మహారాష్ట్రలో ఠాక్రే ఫ్యాక్టర్‌ని ఎదుర్కోవాలంటే మరో ఠాక్రే కావాలని బీజేపీ భావిస్తోంది. దీంతో ఉద్ధవ్ ఠాక్రేకి చెక్ పెట్టేందుకు బీజేపీ రాజ్ ఠాక్రేని తెరపైకి తీసుకువచ్చింది. ఈ సారి ఎన్డీయే కూటమి ఎలాగైనా 400 స్థానాలు సాధించాలని, సొంతగా బీజేపీ 370 స్థానాలు సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ నేపథ్యంలో పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.

Exit mobile version