ప్రముఖ రాజకీయ నాయకుడు, బాలీవుడ్ యాక్టర్ రాజ్ బబ్బర్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది యూపీ లక్నో కోర్టు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా.. అతనిపై దాడి చేసిన కేసులో తాజాగా లక్నో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. మే 1996లో ఎన్నికల సందర్భంగా పోలింగ్ అధికారిపై రాజ్ బబ్బర్ దాడి చేశాడు. ఈ ఘటనపై యూపీలోని వజీర్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. 1996 ఎన్నికల సమయంలో రాజ్ బబ్బర్ సమాజ్ వాదీ పార్టీ నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో యూపీ నుంచి కీలక నేతగా ఉన్నారు.
Read Also: Rishi Sunak: యూకే పీఏం రేసులో భారత సంతతి వ్యక్తి
రాజ్ బబ్బర్‌కు రెండేళ్లు జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 8,500 జరిమానా విధించింది. ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగిండమే కాకుండా, దాడి చేయడం ఇలా మూడు నేరాల కింద రాజ్ బబ్బర్ ను దోషిగా తేల్చింది కోర్టు. కోర్టు తీర్పు వెలువడే సమయంలో రాజ్ బబ్బర్ కోర్ట్ హాలులోనే ఉన్నాడు.