లోకో పైలట్ నిర్లక్ష్యం కారణంగా ఒక కార్మికుడి ప్రాణం పోయింది. ఈ దారుణ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ (నం: 15204) లక్నో జంక్షన్ నుంచి బీహార్‌లోని బెగుసరాయ్‌లోని బరౌని రైల్వే జంక్షన్‌లో రైలు ఆగింది. ప్లాట్‌ఫాం 5పై ఆగి ఉంది. రైల్వే పోర్టర్ అమర్‌కుమర్‌రావు కిందకి దిగి ఇంజిన్- రైలు కోచ్‌ల మధ్య ఉన్న కప్లింగ్‌ను ఊడదీశారు. అయితే అనూహ్యంగా రైలు రివర్స్ రావడంతో క్యారేజీల మధ్య అమర్‌కుమార్‌రావు నలిగిపోయాడు. క్యారేజీల మధ్య నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే రావు ప్రాణాలు వదిలాడు. అక్కడే ఉన్న కొందరు అరుస్తూ హెచ్చరించినా లోక్ పైలట్ సరిగ్గా స్పందించలేదు. ప్రమాదం జరగగానే రైలు డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఇంజిన్‌ను కంట్రోల్ చేసే విషయంలో డ్రైవర్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో ఒక కార్మికుడు బలైపోయాడు.
ఇది కూడా చదవండి: Amit Shah: మత రిజర్వేషన్లను బీజేపీ ఎప్పటికీ అంగీకరించదు.. రాహుల్‌పై షా ఫైర్..
ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉన్న ప్రయాణికులు మొబైల్‌లో చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోకో పైలట్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Fake Lady Inspector: నకిలీ లేడీ ఇన్‌స్పెక్టర్ గుట్టురట్టు.. యూనిఫాం ధరించి 8 ఏళ్లుగా సందడి