NTV Telugu Site icon

Viral News: ముందుగా వచ్చిన రైలు.. ప్రయాణికుల డ్యాన్స్

Ratlam Station

Ratlam Station

బండి .. బండి రైలు బండి.. వేళకంటూ రాదులేండి.. దీన్ని గాని నమ్మూకుంటే ఇంతేనండీ.. ఇంతేనండీ.. నితిన్ నటించిన ‘జయం’ సినిమాలోని పాట మీకు గుర్తుందా? దేశంలోని రైళ్లు ఎప్పుడూ సరైన సమయానికి రావనే అపవాదు ఉంది. అందుకే సినిమాల్లో కూడా పాట రూపంలో ఈ విషయాన్ని పొందుపరిచారు. అయితే ఈ అపవాదను పోగొట్టుకోవడానికి రైల్వేశాఖ కృషి చేస్తూనే ఉంది. ఈ క్రమంలో బాంద్రా నుంచి హరిద్వార్ వెళ్లాల్సిన రైలు బుధవారం రాత్రి 10:35కు రత్లాంకు చేరుకోవాలి. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ రైలు 20 నిమిషాల ముందుగానే రత్లాంకు చేరుకుంది.

Cause of Death 2020: కరోనా కాదు… ఎక్కువ మరణాలకు ఇవే కారణం

దీంతో ముందే వచ్చిన రైలును చూసి ప్రయాణికులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. సంతోషం పట్టలేక ప్రయాణికులు ప్లాట్‌ఫారం మీదే ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. రైలులోని ప్రయాణికులకు కూడా 20 నిమిషాల సమయం దొరకడంతో అందరూ రైలు దిగి తమ ఆనందాన్ని డ్యాన్స్ రూపంలో వ్యక్తం చేశారు. సంప్రదాయ గర్భా నృత్యంతో అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ‘హ్యాపీ జర్నీ’ అని రాసుకొచ్చారు.