Site icon NTV Telugu

రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం: నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే జైలుకే…

రైళ్ల‌లో ప్ర‌యాణం చేసేవారి భ‌ద్ర‌త విష‌యంలో రైల్వేశాఖ‌కు అనేక ఫిర్యాదులు అందుతుండ‌టంతో కొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌లులోకి తీసుకొచ్చింది. రైళ్ల‌లో ప్ర‌యాణం చేసే తోటి ప్ర‌యాణికుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌లిగించినా వారిపై కేసులు న‌మోదు చేసి జైలుకు పంపించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ బాధ్య‌త‌ల‌ను ఆర్పీఎఫ్‌కు అప్ప‌గిస్తూ రైల్వేశాఖ నిర్ణ‌యం తీసుకుంది. రైళ్ల‌లో ప్ర‌యాణం చేసే స‌మ‌యంలో బోగీల్లో ల్యాప్‌ట్యాప్‌, మొబైల్‌ఫోన్‌ల‌లో పెద్దగా శ‌బ్దం వ‌చ్చేలా పాట‌లు వంటివి పెట్ట‌కూడ‌దు. ఫోన్‌లో బిగ్గ‌రగా మాట్లాడ‌రాదు. సాధార‌ణ త‌ర‌గ‌తుల్లోప్ర‌యాణం చేసే వారు కూడా రాత్రి ప‌ది గంట‌ల వ‌రువాత బిగ్గ‌రగా మాట్లాడ‌టంపై కూడా నిషేధం విధించారు.

Read: తెలంగాణ‌లో ఫిబ్ర‌వరి 1 నుంచి స్కూళ్లు రీఓపెన్‌…

నిబంధ‌న‌ల‌ను వ్య‌తిరేకిస్తే వారిపై కేసులు న‌మోదు చేసి జైలుకు పంపే అవ‌కాశం ఉంటుంది. అంతేకాదు, రాత్రి 10 గంట‌ల త‌రువాత అన్ని బోగీల్లో లైట్లు త‌ప్ప‌నిస‌రిగా ఆర్పేయాలి. లేదంటే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారు. ప్ర‌యాణం స‌మ‌యంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 139 నెంబ‌ర్‌కు కాల్ చేయాల‌ని రైల్వేశాఖ పేర్కొన్న‌ది. ఇక‌పై రైళ్ల‌లో నిరంత‌రం రైల్వే సిబ్బంది ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Exit mobile version