Site icon NTV Telugu

Congress: కాంగ్రెస్‌కి దెబ్బ మీద దెబ్బ.. 2019 నుంచి పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నేతలు వీరే..

Congress

Congress

Congress: కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 2019 నుంచి ఆ పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్తూనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్రలో కీలక నేత, కాంగ్రెస్‌తో 50 ఏళ్లుగా అనుబంధం ఉన్న కుటుంబంలోని సీనియర్ నేత మిలింద్ దేవరా కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ మొదలుపెట్టే రోజు ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

మిలింద్ దేవరా:
కాంగ్రెస్ సీనియర్ నేత మురళీ దేవరా కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా ఆదివారం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అదేరోజు ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరతారని భావిస్తున్నారు. విపక్ష కూటమిలో భాగమైన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ముంబై సౌత్ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పుకోవడంపై ఆయన ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు.

హార్దిక్ పటేల్:

గుజరాత్‌లో పాటీదార్ వర్గ నేత హర్దిక్ పటేల్ 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2022లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

అశ్వనీ కుమార్:

మాజీ కేంద్రమంత్రి అశ్వనీ కుమార్ పంజాబ్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు 2022లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

సునీల్ జాఖర్:
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న సునీల్ జాఖర్ 2022లో పార్టీకి గుడ్ బై చెప్పారు. అదే ఏడాది మేలో బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర బీజేపీకి చీఫ్‌గా ఉన్నారు.

ఆర్పీఎన్ సింగ్:
మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత ఆర్పీఎన్ సింగ్ కాంగ్రెస్‌పార్టీని 2022లో వీడారు. యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంకాగాంధీ తనను పక్కన పెట్టినందుకు సింగ్ పార్టీ నుంచి తప్పుకున్నారు.

జ్యోతిరాధిత్య సింధియా:

కేంద్రమంత్రిగా ఉన్న జ్యోతిరాధిత్య సింధియా, మధ్యప్రదేశ్‌లో కీలక నాయకుడు. కమల్ నాథ్‌తో విభేదాల కారణంగా 2020లో బీజేపీలో చేరారు. సింధియా దెబ్బకు ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది.

జితిన్ ప్రసాద:

రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద 2021లో బీజేపీలో చేరారు. ఆయన ఉత్తర్ ప్రదేశ్ బ్రహ్మణ వర్గంలో కీలక నేత.

అల్పేష్ ఠాకూర్:

మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, గుజరాత్ నేత అల్పేష్ ఠాకూర్ 2019లో కాంగ్రెస్‌ని వీడారు. కొన్ని రోజుల క్రితం ఆయన బీజేపీలో చేరారు.

అనిల్ ఆంటోని:

మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోనీ గత ఏడాది పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆయన తండ్రి ఏకే ఆంటోని కుమారుడి నిర్ణయంపై ఆవేదన, నిరాశ వ్యక్తం చేశారు.

 

Exit mobile version