Site icon NTV Telugu

Rahul Gandhi: సావర్కార్ గురించి ప్రస్తావిస్తే నన్ను దోషిగా చూస్తున్నారు..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: లోక్‌స‌భ‌లో భారత రాజ్యాంగంపై చర్చ కొనసాగుతుంది. ఈ సందర్భంగా లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సావర్కార్ సిద్ధాంతంపై విమర్శలు గుప్పించారు. సావర్కార్ గురించి ప్రస్తావిస్తే ఈ బీజేపీ నన్ను దోషిగా చూస్తున్నారని ఆరోపించారు. అనేక మంది మేధావుల ఆలోచనలకు ప్రతిరూపం మన రాజ్యాంగం.. దేశంలోని ప్రజలు వివిధ రకాల సిద్ధాంతాలను పాటిస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, లోక్ సభలో మహా భారతంలోని కుల వివక్షను ప్రస్తావించారు.. ఏకలవ్యుడు శిక్షణ కోసం ద్రోణాచార్యుడు దగ్గరకు వెళ్తే.. నువ్వు మా జాతివాడిని కాదని వెనక్కి పంపాడు అని చెప్పుకొచ్చారు.. కానీ, ద్రోణుడి ప్రతిరూపంతో ఏకలవ్వుడు విలు విద్య నేర్చుకున్నాడు.. కానీ, ద్రోణాచార్యుడు మాత్రం గురు దక్షిణగా ఏకలవ్వుడి బొటన వేలు ఇవ్వాలని అడిగాడు అని రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రస్తావించారు.

Read Also: PAK: మరో మైలురాయి సాధించిన బాబర్ ఆజం.. కోహ్లీని వెనక్కి నెట్టి

అయితే, ద్రోణాచార్య ఏకలవ్వుడి బొటన వేలు ఎలా నరికిందో.. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కూడా దేశాన్ని నాశనం చేస్తుందని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. భారత్ లోని యువత బొటను వేలును మోడీ సర్కార్ అలా నరికి వేస్తుందని పేర్కొన్నారు. ఈ ఎన్డీయే ప్రభుత్వం అదానీకి అన్ని ప్రాజెక్టులు అప్పగించడం వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కనుమరుగైతున్నాయని అన్నారు. దేశంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు, డిఫెన్స్ రంగాలను మొత్తం అదానీ అప్పగిస్తున్నారని మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు.

Exit mobile version