Rahul Gandhi: రాయ్‌బరేలీ “కర్మభూమి”.. నా తల్లి బాధ్యతల్ని అప్పగించింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. కొన్ని పర్యాయాలుగా సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానం నుంచి ఆయన బరిలోకి దిగారు. నామినేషన్ తర్వాత ఆయన భావోద్వేగంతో ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లి 20 ఏళ్లుగా కొనసాగిన ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయడం తనకు ఉద్వేగభరితమైందని ఆయన శుక్రవారం అన్నారు. తన కుటుంబానికి ‘కర్మభూమి’గా రాయ్‌బరేలీని అభివర్ణించారు. తన తల్లి ఈ బాధ్యతల్ని అప్పగించి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిందని చెప్పారు.
Read Also: Pawan Kalyan: కూటమి అధికారంలోకి రాగానే ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్‌పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్‌లో జరిగినట్లే భారత్‌లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్‌చుక్ హెచ్చరిక
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో అమేథీ నుంచి రాహుల్ గాంధీ ఓడిపోయారు. అయితే, ఈ ఎన్నికల్లో ఇప్పటికే కేరళ వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్, రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అమేథీ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా పేరొందిన కిషోరీ లాల్ శర్మ పోటీ చేస్తున్నారు. అమేథీ, రాయ్‌బరేలీ రెండూ నాకు వేర్వేదు కాదని, ఈ రెండు నియోజకవర్గాల్లోని ప్రజలు తన కటుంబమే అని, 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేస్తున్న కిషోరి లాల్ జీ అయేథీ నుంచి పార్టీ తరుపున ప్రాతినిధ్యం వహించడం పట్ల రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు.
‘‘ అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయం కోసం జరుగుతున్న పోరాటంలో, నేను నా ప్రియమైన వారి ప్రేమ, ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించే ఈ పోరాటంలో మీరందరూ నాకు అండగా ఉంటారనే నమ్మకం ఉంది. ’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు ఆయన నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, తల్లి సోనియా గాంధీ, రాబర్ట్ వాడ్రా హాజరయ్యారు. రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్న సోనియా గాంధీ ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీ ఎన్నికయ్యారు. మరోవైపు రాహుల్ గాంధీకి ప్రత్యర్థిగా బీజేపీ నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ ఉన్నారు.
रायबरेली से नामांकन मेरे लिए भावुक पल था!
मेरी मां ने मुझे बड़े भरोसे के साथ परिवार की कर्मभूमि सौंपी है और उसकी सेवा का मौका दिया है।
अमेठी और रायबरेली मेरे लिए अलग-अलग नहीं हैं, दोनों ही मेरा परिवार हैं और मुझे ख़ुशी है कि 40 वर्षों से क्षेत्र की सेवा कर रहे किशोरी लाल जी… pic.twitter.com/g4E94zuOVf
— Rahul Gandhi (@RahulGandhi) May 3, 2024
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?