NTV Telugu Site icon

Rahul Gandhi: కుటుంబంతో రెస్టారెంట్‌లో ఎంజాయ్ చేస్తున్న రాహుల్ గాంధీ..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికలు, ఆ తర్వాత హర్యానా అసెంబ్లీ ఎన్నికలు, వీటి తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీల ఎన్నికలతో రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. ఇవి ముగిసిన కొన్ని రోజులకే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిగాయి. ఇలా గత ఆరు నెలల నుంచి ఎన్నికల ప్రచారాల్లో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ, తన కుటుంబానికి సమాయాన్ని కేటాయించారు. కుటుంబంతో రిఫ్రెష్ అవుతున్నారు.

Read Also: UP: 18 ఏళ్ల బాలుడితో ప్రేమలో పడ్డ 51ఏళ్ల మహిళ.. చివరికీ..

ఢిల్లీలోని ఐకానిక్ క్వాలిటీ రెస్టారెంట్‌లో రాహుల్ గాంధీ, తన తల్లి సోనియా గాంధీ, తన సోదరి ప్రియాంకా వాద్రా, ప్రియాంకా భర్త రాబర్ట్ వాద్రా, వీరి కూతురు మిరాయా వాద్రాలో ఎంజాయ్ చేశారు. గాంధీ కుటుంబం మొత్తం క్వాలిటీ రెస్టారెంట్‌లో చోలో-భాతురేతో పాటు నోరూరించే వంటకాలను ఆర్డర్ చేశారు.

రాహుల్ గాంధీ తన వాట్సాప్ స్టేటస్‌లో కుటుంబంతో కలిసి కూర్చోని భోజనం చేస్తున్న ఫోటోలను షేర్ చేవారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. అనేక మంది నెటిజర్లు లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు. రాహుల్ గాంధీ తన స్టేటస్‌కి ఫోటోలు ఉంచుతూ.. ఐకానిక్ క్వాలిటీ రెస్టారెంట్‌లో ఫ్యామిలీ లంచ్ అంటూ రాశారు. ‘‘మీరు వెళితే చోలే భాతురే ప్రయత్నించండి అంటూ సలహా కూడా ఇచ్చారు. ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఉండే ఈ క్వాలిటీ రెస్టారెంట్‌కి స్వాతంత్య్రం ముందు నుంచి ఉంది. అనేక దశాబ్ధాలుగా రెస్టారెంట్ మల్టీ-కాంటినెంట్ వంటలకు ప్రసిద్ధి చెందింది. ఈ రెస్టారెంట్‌లో వడ్డించే చోలే-బతురే ఎక్కువగా అమ్ముడవుతున్న ఫుడ్ ఐటెం.

Show comments