Rahul Gandhi’s comments on RSS and Varun Gandhi: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హోషియార్ పూర్ లో భారత్ జోడో యాత్ర సాగుతున్న సమయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఆఫీసుకు వెళ్లాలంటే ముందుగా నా తల నరకాలి అంటూ మంగళవారం వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ, తన బంధువు వరణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ పెరుగుతున్న ఊహాగానాల మధ్య రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అంగీకరించనని.. వరుణ్ గాంధీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అంగీకరించారని వ్యాఖ్యానించారు.
Read Also: Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్.. మరో 550కోట్లు విడుదల చేసిన సర్కార్
వరుణ్ గాంధీ, భారత్ జోడో యాత్రలో నడిస్తే తనకు ఇబ్బంది కావచ్చని.. నా భావజాలం, అతడి భావజాలంతో సరిపోదని.. నా కుటుంబానికి మరో సైద్ధాంతిక భావజాలం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. నేను, వరుణ్ గాంధీని కలిసి కౌగిలించుకోగలనని.. కానీ అతడి భావజాలాన్ని అంగీకరించనని అన్నారు. మీడియాను కూడా విమర్శించారు రాహుల్ గాంధీ. మీడియాలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా పరధ్యానం పాత్ర పోషిస్తోందని అన్నారు. మీడియాపై నియంత్రణ, ఒత్తడి ఉందని.. విలేకరులు తప్పు చేయరని.. మీ యజమాని మీకు ఏది చెబితే అదే మీరు చేస్తారని అన్నారు. నేను విలేకరులను విమర్శించడం లేదని మీడియా నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు.
మీడియా ప్రజాస్వామ్యానికి కాపలా కుక్కలా ఉండాలని అన్నారు. చిరువ్యాపారులు నలిగిపోతున్నారని, రైతులను దోచుకుంటున్నారని.. కానీ మీరు హిందూ, ముస్లిం, బాలీవుడ్, స్పోర్ట్స్ అంటూ పరధ్యానంలో ఉంటున్నారని విమర్శించారు. యూపీ పిలిభిత్ స్థానం నుంచి బీజేపీ తరుపున 2009 నుంచి వరణ్ గాంధీ, ఆయన తల్లి మేనకాగాంధీ గెలుస్తూ వస్తున్నారు. అయితే నరేంద్రమోదీ క్యాబినెలట్లో మేనకాగాంధీకి బెర్త్ దక్కకపోవడంపై నిరాశలో ఉన్నారు వరుణ్ గాంధీ. కాగా, ఇటీవల కొన్ని రోజుల నుంచి బీజేపీ విధానాలపై ప్రశ్నిస్తున్నారు వరుణ్ గాంధీ. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
