Anurag Thakur criticizes Rahul Gandhi: రాహుల్ గాంధీ ఓటమిని అంగీకరించడం లేదని విమర్శించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. తాను ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నిఘాలో ఉన్నానని యూకే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ అన్నారు. భారత ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని ఆయన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. అనురాగ్ ఠాకూర్, రాహుల్ గాంధీ విమర్శలను శుక్రవారం తప్పుపట్టారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత విదేశీ గడ్డపై భారతదేశాన్ని అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Sexual Ability : పురుషుల లైంగిక ఆరోగ్యాన్ని ‘కోకా-కోలా, పెప్సీ’ మెరుగుపరుస్తాయట..
భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, తనతో పాటు ఇతర రాజకీయ నేతలపై ఇజ్రాయిలీ స్పైవేర్ పెగాసస్ తో నిఘా పెట్టారని ఆరోపించారు. అయితే సుప్రీంకోర్టు నియమించిన టెక్నికల్ కమిటీకి రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు తమ ఫోన్లను ఎందుకు సమర్పించలేదని ఠాకూర్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ పట్ల రాహుల్ గాంధీకి ఉన్న ద్వేషాన్ని అర్ధం చేసుకోగలం, అయితే విదేశీ స్నేహితుల సాయంతో దేశాన్ని కించపరిచే కుట్రకు కాంగ్రెస్ తెరతీసిందని ఆయన ఆరోపించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదని రాహుల్ గాంధీకి తెలుసని, అందుకే విదేశీ గడ్డపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా విదేశీ గడ్డపై దుష్ఫ్రచారం చేయడం చూస్తే కాంగ్రెస్ దివాళాకోరు తనం అర్థం అవుతోందని అన్నారు. పెగాసస్ విషయంలో ఆయన పదేపదే అబద్ధాలు చెబుతున్నారని ఠాకూర్ ఆరోపించారు. విదేశాల్లో భారత్ పరువుతీయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ గురించి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని చెప్పేది కనీసం రాహుల్ గాంధీ వినాలని అన్నారు. ప్రధాని మోదీ నాయకుడిగా ఎదిగారని, రాహుల్ గాంధీ ఆయన కాంగ్రెస్ మాత్రం పదేపదే ఎన్నికల్లో ఓడిపోతుందని దుయ్యబట్టారు.