NTV Telugu Site icon

Rahul Gandhi: భారత్ ఆర్థిక పరిస్థితి శ్రీలంక లాగే ఉంది

Rahul Gandhi

Rahul Gandhi

భారతదేశ ఆర్థిక పరిస్థితి కూడా శ్రీలంక లాగే ఉందని విమర్శించారు కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. దేశంలో పెట్రోల్ రేట్లు, నిరుద్యోగిత, మతహింసలపై ట్వీట్ చేశారు. శ్రీలంక, ఇండియా ఆర్థిక పరిస్థితికి సంబంధించి గ్రాఫ్ లతో సహా ట్విట్టర్ లో పెట్టారు.

2011 నుంచి 2017 వరకు శ్రీలంక, భారత్ దేశాల్లో పెట్రోల్ రేట్లు, నిరుద్యోగం, మతహింస ఎలా ఉందనే దానిపై ట్వీట్ చేశారు. భారత దేశ ఆర్థిక పరిస్థితి కూడా శ్రీలంక లాగే ఉందని విమర్శించారు. ప్రజలను మభ్య పెట్టడం వల్ల వాస్తవాలు మారవు అని ఆయన అన్నారు. ఇండియాలో పెట్రోల్ ధరలు క్రమంగా పెరుతున్నాయని గ్రాఫ్ లో చూపించారు.

ఇదిలా ఉంటే బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థను పట్టించుకోవడం లేదని… ద్రవ్యోల్భనం పెరుగుతున్నా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. బీజేపీ సమాజంలో విభజన తీసుకువచ్చేలా చేస్తుందని … బీజేపీ కేంద్ర ప్రభుత్వం సంస్థలను ఉపయోగించుకుని విపక్షాలపై దాడుల చేస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

ప్రస్తుతం శ్రీలంక తీవ్ర ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయింది. కనీసం పెట్రోల్ కు డబ్బులు చెల్లిద్దామన్నా.. దేశ ఖజానాలో చిల్లి గవ్వ లేదు. గత కొన్ని నెలలుగా శ్రీలంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి అధ్యక్షుడు గోటబయ రాజపక్స, మాజీ ప్రధాని మహిందా రాజపక్సలకు వ్యతిరేఖంగా ఆందోళన కార్యక్రమాలు చేశారు. గత వారం ఈ ఆందోళన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. దీంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్స కొత్తగా రణిల్ విక్రమసింఘే ప్రధానిగా నియమించారు.