పార్లమెంట్‌లో రైతు చట్టాలపై వాడీవేడీ చర్చలు జరుగుతున్నాయి. రైతు చట్టాలను బ్యాన్ చేయాలని ఇప్పటికే రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలు నిర్వహించారు. పార్లమెంట్ ముట్టడిని మొదట ప్రకటించినప్పటికీ, ఆ తరువాత ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది. రైతులకు మద్దతు ఇస్తూ వస్తున్నది. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్రాక్టర్ డ్రైవర్‌గా మారిపోయారు. పార్లమెంట్ సమావేశాలకు కారులో కాకుండా ట్రాక్టర్‌లో వెళ్లారు. సొంతంగా ట్రాక్టర్‌ను డ్రైవింగ్ చేసుకుంటూ పార్లమెంట్ కు వెళ్లారు. దీనికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ట్రాక్టర్ డ్రైవర్‌గా మారిన రాహుల్ గాంధీ…
