Site icon NTV Telugu

Rahul Gandhi: రాహుల్ గాంధీ యూకే పర్యటన.. కేంబ్రిడ్జ్‌లో ఉపన్యాసం..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ నెలలో యూకే పర్యటనకు వెళ్లనున్నారు. ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ స్కూల్ లో ఉపన్యాసం ఇవ్వనున్నారు. యూకే పర్యటన వివరాలను రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని సందర్శించచి ఉపన్యాసం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. “భౌగోళిక రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు, ప్రజాస్వామ్యంతో సహా వివిధ అంశాలపై కొంతమంది తెలివైన వారిని కలుసుకోబోతుండటం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.

Read Also: Mark Zuckerberg: జుకర్‌బర్గ్‌కు భారీ స్థాయిలో భద్రత పెంపు..అందుకేనా!

రాహుల్ గాంధీని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి తిరిగి స్వాగతించడం ఆనందంగా ఉందని కేంబ్రిడ్జ్ బిజినెస్ స్కూల్ ఓ ట్వీట్ లో పేర్కొంది. ప్రజాస్వామ్యం, భారత్-చైనా సంబంధాలపై ఆయన ప్రసంగిస్తారని యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జరిగిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగే కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరు అవుతారు. 2024 సార్వత్రిక ఎన్నికల గురించి ఈ సమావేశంలో విస్తృతస్థాయిలో చర్చించనున్నారు.

Exit mobile version