NTV Telugu Site icon

Bihar: కన్హయ్య కుమార్‌తో కలిసి పాదయాత్ర చేయనున్న రాహుల్‌గాంధీ

Rahulgandhi

Rahulgandhi

బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. బీజేపీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. ఇక కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ కొద్దిరోజులుగా ‘‘పలయన్ రోకో, నౌక్రీ దో’’ (వలసలను ఆపండి, ఉద్యోగాలు కల్పించండి) పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. సోమవారం బెగుసరాయ్‌‌లో జరిగే పాదయాత్రలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కన్హయ్య కుమార్‌తో కలిసి రాహుల్ పాదయాత్ర చేయనున్నారు.

ఇది కూడా చదవండి: NBK : కథల వడపోతలో బాలయ్య బిజీబిజీ

ఇక రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొనేవారంతా తెల్లటి టీ-షర్టులు ధరించి.. హక్కుల కోసం గొంతు విప్పాలని యువతకు కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కోరారు. యువత పోరాటాన్ని.. ప్రపంచ మొత్తం చూసేలా చేయడమే లక్ష్యమని పేర్కొ్న్నారు. ఎన్డీఏ కూటమిని అధికారంలోంచి దించేందుకు యువత నడుం బిగించాలని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. బీహార్‌ను అవకాశాల రాష్ట్రంగా మారుద్దామని కోరారు.

ఇది కూడా చదవండి: Shubman Gill: సిరాజ్‌ సూపర్.. బ్యాటర్ల కంటే బౌలర్లే గేమ్‌ ఛేంజర్లు!

ఇక మధ్యాహ్నం 1 ఒంటి గంటకు పాట్నాలోని శ్రీ కృష్ణ మెమోరియల్ హాల్‌లో జరిగే రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో పాల్గొంటారు. అనంతరం గాంధీ సడకత్ ఆశ్రమంలో కాంగ్రెస్ నాయకులను కలుస్తారు. సాయంత్రం 4:10 గంటలకు ఢిల్లీకి తిరిగి వెళతారు. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రీయ జనతాదళ్, వామపక్ష పార్టీలతో కూడిన మహాఘట్బంధన్‌లో కాంగ్రెస్ భాగంగా ఉంది.

ఇది కూడా చదవండి: ED Raids: తమిళనాడులో ఈడీ సోదాలు.. ఆ మంత్రే టార్గెట్!